BigTV English

Trinayani Serial Today October 13th: ‘త్రినయని’ సీరియల్‌: గజగండను చంపేసిన అమ్మవారు – రెండు మణుల్ని మనసాదేవి ఆలయంలో పెట్టిన నయని

Trinayani Serial Today October 13th: ‘త్రినయని’ సీరియల్‌: గజగండను చంపేసిన అమ్మవారు – రెండు మణుల్ని మనసాదేవి ఆలయంలో పెట్టిన నయని

trinayani serial today Episode:  పంచకమణి పూజలో పెట్టి గజగండ పూజలు చేస్తుంటే విశాల్‌, నయని వస్తారు. క్షద్రపూజలు ఇంక చాలించు గజగండ అంటాడు విశాల్‌. విశాల్‌ మాటలకు కళ్లు తెరిచి చూసిన గజగండ సంతోషం భూజంగమణి ఇద్దామని వచ్చారన్నమాట అంటాడు. దీంతో భుజంగమణితో పాటు పంచకమణిని తీసుకుని వెళ్దామని వచ్చాం అంటాడు విశాల్‌. దీంతో గజగండ కోపంగా అయితే నయని నీ మెడలో తాళి తెగడం ఖాయం అంటాడు. దీంతో విశాల్‌ వెంటనే గజగండను కాలితో తంతాడు.


దూరంగా పడిపోయిన గజగండ పంచకమణితో విశాల్‌ను కట్టడి చేస్తాడు. విశాల్‌ బయపడుతూ నయని దగ్గరకు రావొద్దు అంటాడు. వాడి దగ్గర పంచకమణి ఉంటే మన దగ్గర భుజంగమణి ఉంది బాబుగారు అంటూ భుజంగమణితో విశాల్‌ కట్టు విడిపిస్తుంది. ఇద్దరు కలిసి గజగండ మీదకు వెళ్తారు. గజగండ ఎన్ని మంత్రాలు వేసినా విశాల్‌ కు ఏమీ కాదు. దీంతో విశాల్‌, గజగండను తంతాడు. దీంతో గజగండ అక్కడి నుంచి మాయం అవుతాడు. ఇంతలో మాయాదండం తీసుకుని వచ్చి నయనిని విశాల్‌ నుంచి దూరంగా నెట్టి విశాల్‌ ను కొడతాడు. నయనిని కొడతాడు. మణి నయని చేతిలోంచి దూరంగా పడిపోతుంది.

గజగండ, నయని గొంతు నులుముతూ ఉంటాడు. మణిని వెతికి తీసుకుని వచ్చిన విశాల్‌ అరే మూర్ఖుడా.. నయని మెడలో ఉన్న అమ్మవారి మీద చేయి వేశావు. అనగానే అమ్మా ఈ అమ్మనేనా నువ్వు పిలిచావు. ఇది నీ మెడలో ఉన్నందుకేనా ఇంత శక్తి అంటూ అమ్మవారి ప్రతిమను దూరంగా విసిరివేస్తాడు గజగండ. పాపం నువ్వు తలిచి పిలిచే అమ్మవారు రాయికి కొట్టుకుని కిందపడిపోయారు. ఇప్పుడు రమ్మను మీ అమ్మను అంటూ గట్టిగా నవ్వుతుంటాడు గజగండ. ఇంతలో అమ్మవారు వస్తారు. అమ్మవారిని చూసిన నయని, విశాల్‌ హ్యాపీగా ఫీలవుతారు.


గజగండ ఏంటిది అంటూ భయపడతాడు. దీంతో అమ్మా వస్తుందిరా అంటూ చెప్తుంది నయని. అమ్మవారికి నయని, విశాల్‌ దండం పెట్టుకుంటారు. అమ్మవారు కోపంగా గజగండ మీదకు వచ్చి పొడిచేస్తుంది. దీంతో గజగండ చేతిలో ని పంచకమణి కిందపడిపోతుంది. అమ్మవారే స్వయంగా నయని మెడలో అమ్మవారి ప్రతిమను కడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం పంచకమణిని, భుజంగమణిని మనసాదేవి సన్నిధికి చేర్చు శుభం కలుగుగాక అంటూ వెళ్లిపోతుంది. నయని నన్ను కన్నతల్లిని చూడలేదు కానీ ముల్లోకాలను ఏలే ఆ తల్లిని మాత్రం చూడగలిగాను ఎంత అదృష్టం అంటాడు.

తిలొత్తమ్మ ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో వల్లభ టెన్షన్‌ గా పరుగెత్తుకొచ్చి గజగండవ చనిపోయాడంట మమ్మీ అని చెప్తాడు. దీంతో తిలొత్తమ్మ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు వల్లభ అని అడుగుతుంది. ఎలా చనిపోయిందట అని అడగ్గానే చుట్టుపక్కల వాళ్లు పులి వేటాడింది అంటున్నారు. పులా పులి ఎలా వస్తుంది అని తిలొత్తమ్మ అడుగుతుంది. పులిలా నయని వెళ్లింది కదా మమ్మీ అంటాడు వల్లభ. భుజంగమణిని తీసుకుని ఇంట్లో నుంచి కదిలారు.

పంచకమణిని గజగండ నుంచి తీసుకుని వెళ్తాము అంటే అది ఆషామాషీ విషయం కాదని మనమే హేళన చేసి మాట్లాడాము. కానీ గజగండ రక్తపుమడుగులో పడ్డాడంటే ఎలా పడ్డాడు అర్థం చేసుకోవచ్చు వల్లభ అంటుంది తిలొత్తమ్మ. దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా మమ్మీ నయని కదం తొక్కిందేమో మమ్మీ అటాడు వల్లభ. అయితే గంటలమ్మను పిలిపించి నయని మీద కేసు పెట్టిస్తే సరి అంటుంది తిలొత్తమ్మ. దీంతో లాభం లేదు మమ్మీ గంటలమ్మ కూడా రక్తం కక్కుతుందట అంటాడు. దీంతో తిలొత్తమ్మ షాక్‌ అవుతుంది. ఏంట్రా నువ్వు ఒక్కోసారి ఒక్కో భయంకరమైన విషయం చెప్తున్నావు అంటూ భయపడుతుంది తిలొత్తమ్మ.

నయని, విశాల్‌ అమ్మవారి సన్నిధికి వెళ్లి రెండు మణులను నీ దగ్గరకు తీసుకొచ్చాము తల్లీ అంటూ  మొక్కుతారు. అమ్మవారి సన్నిధిలో రెండు మణులను పెడుతుంది నయని. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంట్లో విక్రాంత్‌ ఏదో ఆలోచిస్తుంటాడు. ఇంతలో సుమన వచ్చి భోజనానికి రాలేదు అని అడుగుతుంది. నువ్వు తిన్నావు కదా? అంటాడు విక్రాంత్‌.

అవును రోజూ తినేదానికన్నా రెండు ముద్దలు ఎక్కువే తిన్నాను అంటూ ఎందుకు తిన్నానో అడగడం లేదు అంటుంది సుమన. కానీ నువ్వు ఎలాగూ చెప్తావు కదా? అంటాడు విక్రాంత్‌. దీంతో ఏదో పిక్నిక్‌ కు  వెళ్లినట్టు మా అక్కా బావ  మానసాదేవి గుడికి వెళ్లారు కదా?  ఇప్పటికీ వాళ్ల జాడ లేదు ఏమైపోయారోనని బాధతో రెండు ముద్దలు ఎక్కువ తినేశాను అంటుంది సుమన. దీంతో సుమనను తిడతాడు విక్రాంత్‌. ఆలెరెడీ పంచకమణిని కూడా తీసుకుని వాళ్లు ఎప్పుడో వెళ్లారు. గజగండ కూడా చనిపోయాడని విక్రాంత్‌ చెప్పగానే సుమన షాక్‌ అవుతుంది.

ఇక రెండు మణుల్ని గుడిలో పెట్టి వచ్చాక ఇంట్లో వదినకు శత్రువులు ఎవరెవరున్నారో అంటూ చెప్పబోతుంటే.. నేనంటే అక్కకు చాలా  ఇష్టం పొద్దున్న వెళ్లారు రాగానే వాళ్లకు తినడానికి ఏమైనా చేస్తాను అంటూ సుమన లోపలికి వెళ్తుంది.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Big Stories

×