E-Paper
Advertisement

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు, నుజ్జైన ముందు పార్ట్

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు, నుజ్జైన ముందు పార్ట్
Advertisement

Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది ట్రావెల్ బస్సు.  ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

సూర్యాపేట్ జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రావెల్ బస్సు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాహనాలను వేరు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో యోలా ట్రావెల్స్ బస్సు బయలు దేరింది.

Advertisement

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. నుజ్జైన ముందు పార్టు

కోదాడ పట్టణ సమీపంలోనికి రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. అత్యంత వేగంగా వస్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయతే ట్రావెల్ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది.

బస్సు.. లారీని ఢీకొట్టడంతో లోపల నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే భయంతో తమను రక్షించాలంటూ కేకలు వేశారు. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ALSO READ: అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×