E-Paper
Advertisement

బోల్తాపడిన ట్రావెల్ బస్సు.. ఆపై నుజ్జు నుజ్జు- స్పాట్ లో 30 మంది ప్రయాణికులు, కడప జిల్లాలో ఘోరం

బోల్తాపడిన ట్రావెల్ బస్సు.. ఆపై నుజ్జు నుజ్జు- స్పాట్ లో 30 మంది ప్రయాణికులు, కడప జిల్లాలో ఘోరం
Advertisement

Kadapa: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు ఎక్కడో దగ్గర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్‌లో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ట్రావెల్ బస్సు

Advertisement

శుక్రవారం ఉదయం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదానికి గురైన ఈ బస్సు విజయవాడ నుంచి అనంతపురం జిల్లా కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో వేకువజామున రోడ్డు పైకి గేదె వచ్చింది. వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

Advertisement

నుజ్జు నుజ్జైన బస్సు.. ఘటన సమయంలో 30 మంది ప్రయాణికులు 

ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుంది. క్షతగాత్రులను ట్రీట్‌మెంట్ కోసం సమీపంలోని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×