E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, ఆపై నుజ్జు నుజ్జు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, ఆపై నుజ్జు నుజ్జు
Advertisement

Hyderabad: అతివేగం ప్రమాదకరం.. పదే పదే రోడ్డు పక్కన బోర్డులు కనిపిస్తున్నా వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఈ ఉదయం ఎల్బీ‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రగాయాలు పాలైన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎల్బీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Advertisement

హైదరాబాద్‌ సిటీ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఎల్బీనగర్‌ దగ్గర రోడ్డు పక్కన ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు సూర్యాపేట జిల్లాకు చెందిన అశోక్ కారు నడుపుతున్నాడు. అతడితోపాటు కారులో సరూర్‌నగర్‌కు చెందిన ఫ్రెండ్ మధు ఉన్నాడు.

చిత్ర లేఅవుట్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని కారు గమనించలేదు. కారులో డ్రైవింగ్ చేస్తున్న ఆశోక్, నేరుగా లారీని ఢీ కొట్టాడు. కారు వేగానికి నుజ్జు నుజ్జు అయ్యింది. అంతేకాదు కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఘటన సమయంలో కారులో ఉన్న అశోక్-మధు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

లారీని బలంగా ఢీ కొట్టిన కారు, నుజ్జు నుజ్జైన కారు

ఈలోగా అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. బాధితులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే వాహనాలను పక్కకు తొలిగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×