E-Paper
Advertisement

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. స్పాట్‌లో 36 మంది

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. స్పాట్‌లో 36 మంది
Advertisement

Nandyal Road Accident: రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతూనే ఉన్నాయి. నెలకు ఒకటి చొప్పున ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రావెల్ బస్సు నేరుగా లారీ ఢీ కొట్టింది. ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. చాలామంది గాయపడ్డారు.

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం

Advertisement

నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శిరివెళ్లమెట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 36 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తోది ARBCVR NL 02 B 4647 ట్రావెల్ బస్సు. వేగంగా వెళ్లున్న క్రమంలో ఒక్కసారిగా బస్సు టైరు పేలిపోయింది.

దీంతో అదుపు తప్పిన బస్సు, తొలుత డివైడర్‌ని దాటుకుంటూ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వారిలో బస్సు, లారీ డ్రైవర్లు, క్లీనర్ కూడా ఉన్నాడు. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి.

Advertisement

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు సజీవ దహనం

అర్ధరాత్రి ఘటన కావడంతో లోపలున్న ప్రయాణికులకు ఏం జరిగిందో తెలీయలేదు. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆపాడు డ్రైవర్. ప్రమాద సమయంలో బస్సు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కాలేదు. ఈలోగా డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలను పగలగొట్టాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అందులోని 14 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

చాలామంది ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి దూకేయడంతో గాయాలు అయ్యాయి. ఆ తర్వాత బస్సు మొత్తం తగలబడిపోయింది. ఆ మంటలు లారీకి అంటుకోవడంతో రెండు వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ఇక ప్రయాణికుల సామానులు మంటలకు ఆహుతయ్యాయి.

ALSO READ: చేతిలో సిగరెట్, 120 కి.మీ స్పీడ్.. సీన్ కట్ చేస్తే నలుగురు యువకులు స్పాట్ డెడ్!

ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.  వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఎకఎకీన  అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నేపథ్యంలో ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. డీసీఎం వాహన డ్రైవర్ సకాలంలో స్పందించకుంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని అంటున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×