E-Paper
Advertisement

Udaipur Horror: చేతిలో సిగరెట్, 120 కి.మీ స్పీడ్.. సీన్ కట్ చేస్తే నలుగురు యువకులు స్పాట్ డెడ్!

Udaipur Horror:  చేతిలో సిగరెట్, 120 కి.మీ స్పీడ్.. సీన్ కట్ చేస్తే నలుగురు యువకులు స్పాట్ డెడ్!
Advertisement

తల్లిదండ్రుల అదుపు లేక యువకులు రెచ్చిపోతున్నారు. చెడు అలవాట్లకు బానిసలు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉదయ్ పూర్ ప్రమాదంలో నలుగురు మృతి

తాజాగా ఉదయపూర్‌ లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా నలుగురు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సదరు యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి ముందు ఏకంగా 120 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతిలో సిగరెట్ కూడా ఉంది. కారులో మ్యూజిక్ మోగుతుండగా, పక్కనే ఉన్న స్క్రీన్‌  మీద వీడియో ప్లే అవుతుంది. కారును నెమ్మదిగా నడపాలని ఓ ఫ్రెండ్ చెప్తున్నట్లు వీడియోలో ఉంది. కారు యాక్సిడెంట్ సమయంలో వెనుక సీట్ లోని యువకుడి సెల్ ఫోన్ కెమెరా లో వీడియో రికార్డ్ అయ్యింది. కారు ఎగిరిపడిన తర్వాత చీకటిగా ఉన్నప్పటికీ, ఫోన్ రికార్డ్ అవుతూనే ఉంది. ఓ యువకుడు తనను కాపాడాలని వేడుకుంటున్నట్లుగా వినిపించింది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘మెహ్ఫిల్-ఎ-మిలాద్’కు వెళ్లి వస్తుండగా ప్రమాదం

Advertisement

ఉదయపూర్‌ లో జరిగిన ‘మెహ్ఫిల్-ఎ-మిలాద్’ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆరుగురు స్నేహితులు ఒకే కారులో బయలుదేరి పాత అహ్మదాబాద్ హైవేకి టీ తాగడానికి బయలుదేరారు. వారి కారు గుజరాత్ వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్నేహితులు మొహమ్మద్ అయాన్ (17), ఆదిల్ ఖురేషి (14), షేర్ మొహమ్మద్ (19), గులాం ఖ్వాజా (17) మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.

Read Also: హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పై కారు బోల్తా.. స్పాట్‌లో నలుగురు

వెలుగులోకి వచ్చిన 9 నిమిషాల వీడియో

Advertisement

ప్రమాదానికి ముందు దాదాపు తొమ్మిది నిమిషాల వీడియో వెలుగులోకి వచ్చింది.  కారు వేగం 100 కి.మీ దాటినప్పుడు స్నేహితుడు వార్నింగ్ ఇస్తున్నట్లు వినిపించింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సిగరెట్ తాగుతూ అత్యంత వేగంగా కారు నడిపించడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు నిమిషాలకు పైగా బాధతో యువకులు కేకలు వేసినట్లు వినిపించింది. దయచేసి తమను రక్షించాలని పిలుస్తున్నట్లు కనిపించింది. ఇక ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు యువకులు, ఎదుటి కారులో ఉన్న నలుగురు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also:  సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌కి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×