Road Accidents: ఏపీ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంది. తాజాగా విశాఖ శివారు ప్రాంతంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి సమీప హైవేపై మరొక ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు.
ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
మంగళవారం అర్ధరాత్రి విశాఖ శివారు ప్రాంతమైన ఆనందపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురం మండలం లొడగలవానిపాలెం హైవేపై ఆగి ఉన్న రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో కోళ్ల వ్యాన్. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వెనుక నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. తగరపువలస ఉత్సవాల నుంచి తిరుగు ప్రయాణంలో జరిగింది. ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
విశాఖ శివారులో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో.. ఒంగోలులో మరో వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
ప్రమాదం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. క్రేన్లతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదంలో బుల్లితెర ఢీ ఫేమ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండుకు తీవ్రగాయాలు అయ్యాయి. అతని రెండు కాళ్లకు తీవ్రగాయాల అయినట్టు చెబుతున్నారు.
మరోవైపు ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ లారీ.. మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో గంజాయి అక్రమ రవాణ బయటపడింది.
ALSO READ: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!
దాణా బస్తాల లోడ్‌లో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. 500 కిలోల గంజాయి ఉంటుందని పోలీసుల అంచనా. ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి పరారయ్యారు డ్రైవర్. లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.