E-Paper
Advertisement

Road Accident: రాంగ్ రూట్‌ వ్యవహారం కారుని ఢీకొన్న ట్రక్కు, నుజ్జైన కారు, స్పాట్‌లో ఏడుగురు మృతి

Road Accident: రాంగ్ రూట్‌ వ్యవహారం కారుని ఢీకొన్న ట్రక్కు, నుజ్జైన కారు, స్పాట్‌లో ఏడుగురు మృతి
Advertisement

Road Accident: అతివేగం.. రాంగ్ రూట్లో వ్యవహారం నేపథ్యంలో ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు.. ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో రాత్రి ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిలోని ఇక్బాల్‌గఢ్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ ట్రక్కు.. ఇన్నోవా కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు స్పాటులో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటన నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్రమాదంలో మృతులంతా రాజస్థాన్‌కు చెందినవారు. ప్రమాదం తర్వాత పెద్ద శబ్దం విన్న స్థానికులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈలోగా హైవేపై వెళ్లున్న వాహనదారులు అధికారులకు సమాచారం అందించారు. ఓ వైపు అమీర్‌గఢ్ పోలీసులు మరోవైపు అంబులెన్సులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

Advertisement

రాంగ్ రూట్లో వచ్చి కారుని ఢీ కొట్టిన ట్రక్కు, ఏడుగురు మృతి

ట్రక్కు వేగానికి కారు పూర్తిగా దెబ్బతింది. కారులోని ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం కూడా పోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో  హైవేపై దాదాపు ఐదు  కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాజస్థాన్ నుండి తొమ్మిది మందితో పలన్‌పూర్ ఆసుపత్రికి వెళ్తోంది ఇన్నోవా కారు.

బనస్కాంత ఎస్పీ ప్రశాంత్ సుంబే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు పోలీసులు. ఏడు మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గుర్ని చికిత్స కోసం పాలన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ALSO READ: ప్రియుడిపై కోపం.. ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు, గుంటూరు జిల్లాలో దారుణం

ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రాంతంలో భారీ వాహనాలు తరచు రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేసి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×