Hyderabad Crime News: దేనితో సావాసం చేస్తే.. దాంతో పోతామని పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు. తన మాటలు, చేష్టలతో అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు మాస్ యుద్ధీన్. అంతకుమించి ఒక్క చెప్పాలంటే ఆయనొక రౌడీ షీటర్. ఏం జరిగిందో తెలీదుగానీ, ఆదివారం అర్థరాత్రి నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్రాంతంలో నడిరోడ్డుపై రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ దారుణహత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్లో ఆయనను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మాస్ యుద్ధీన్ స్పాట్‌లో మృతి చెందాడు.
నడిరోడ్డుపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ వ్యక్తిని పరిశీలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. రౌడీషీటర్ మాస్ యుద్ధీన్‌గా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాస్ యుద్ధీన్ హత్య గురించి కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రత్యర్థులే యుద్ధీన్‌ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట యుద్ధీన్‌కు వివాహం జరిగింది. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మాస్ యుద్ధీన్ మృతదేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ALSO READ: తప్పంతా జోజిబాబుదే.. బాలానగర్ యాక్సిడెంట్‌లో మరో ట్విస్ట్
చాలా కేసుల్లో మాస్ యుద్ధీన్ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా చెప్పారు. అయితే యుద్దీన్ హత్య వెనుక ఎవరి పని అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఆయనకు ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా? అనేదానిపై కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆ దిశగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ హత్య
డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఫలక్ నుమాకు చెందిన రౌడీ షీటర్ ను హత్య చేసిన దుండగులు pic.twitter.com/CwOdvM8A6a
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025