Hyderabad Crime: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా, విన్నా నకిలీ వస్తువులు అధికమవుతున్నాయి. వీటి బారిన పడి సామాన్యుడు మోసపోతున్నాడు. తాజాగా కల్తీ డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్న వ్యక్తి షాపులపై దాడులు చేశారు పోలీసులు. చివరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు చార్మినార్ పోలీసులు. అసలు ఎలా జరిగింది?
హైదరాబాద్ మార్కెట్‌లో ముంచెత్తుతున్న నకిలీ డ్రై ఫ్రూట్స్
ఇటీవల హైదరాబాద్ సిటీలో అధికారులు ఆహారం తయారు చేసే షాపులపై దాడులు ముమ్మరం చేశారు. అపరిశుభ్రమైన పరిసరాలు, కాలం చెల్లిన వాటితో ఫుడ్స్ తయారు చేయడంతో అటువైపు ఫోకస్ చేశారు. వారంలో రెండు లేదా మూడు సార్లు దాడులు చేస్తున్నారు అధికారులు. తాజాగా పాతబస్తీలో దాడులు ముమ్మరం చేశారు అధికారులు.
హైదరాబాద్ సిటీలోని చార్మినార్ ప్రాంతంలో భారీగా దాడులు చేశాయి హైదరాబాద్ సిటీ సీసీఎస్-స్పెషల్ క్రైమ్ టీమ్-ఫుడ్ అడల్టరేషన్ టీమ్‌లు. ఈ దాడిలో భారీ మొత్తంలో 30 కార్టన్ డ్రై ఫ్రూట్స్ బాక్సులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల్లో పాడైపోయిన వాటిని నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గోడౌన్‌లో స్టోరేజ్, ఆపై పోలీసుల మెరుపుదాడులు
నిందితుడు చార్మినార్ సమీపంలోని చెలాపురాలో GEM ఫుడ్స్ పేరిట ఏకంగా ఓ గోడౌన్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డ్రై ఫ్రూట్స్‌పై ఫంగస్ పెరిగి దుర్వాసన వస్తోందని, వాటిని గోడౌన్‌లో అపరిశుభ్రమైన పరిసరాల్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలు, ప్యాక్ చేసిన లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
వస్తువులను కొనేటప్పుడు నాణ్యత, వాసన రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎవరైనా పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేకుంటే ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచన చేశారు. చెలాపుర ప్రాంతానికి అసవా మనీష్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: సైబర్ కేటుగాళ్లకు హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!