E-Paper
Advertisement

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ
Advertisement

Naga Shaurya Divorce Rumours:ఇదసలే సోషల్ మీడియా జమానా…దున్నపోతు ఈనకుండానే దూడల్ని కట్టేసే రకాలు ఇక్కడ కోకొల్లలు .ఇక సినీ ఇండస్ట్రీ పై వచ్చే గాసిప్పులకు ,రూమర్స్ కి అయితే అసలు కొదవే ఉండదు.ఇదిగో అచ్చం అలాంటి రూమరే ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.అదేంటి అంటారా ..టాలీవుడ్ హీరో నాగశౌర్య తన భార్య అనూష శెట్టి విడాకులు ఇచ్చేశాడని.

డిజైనర్ అనూష శెట్టిని  వివాహం

Advertisement

నాగ శౌర్య పెళ్లి విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.అప్పట్లో వీరి పెళ్లి అటు సినీ ఇండస్ట్రీలో ,ఇటు అభిమానుల్లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది కూడా . ఇక పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఒక పాప జన్మించింది. ప్రస్తుతం నాగశౌర్య తన భార్య, కూతురితో కలసి లైఫ్ ని హ్యాపీ గా లీడ్ చేస్తున్నాడు కూడా.

విడాకులు ఇచ్చేస్తున్నాడంటూ

Advertisement

అయితే ఎలా మొదలయ్యాయో కానీ నాగ శౌర్య తన భార్య అనూష శెట్టికి విడాకులు ఇచ్చేస్తున్నాడంటూ రూమర్స్ నెట్టింట ఒక రేంజ్ లో చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి.పైగా నాగశౌర్య కొంతకాలంగా సినిమాలకు, మీడియాకు కాస్త దూరంగా ఉండటంతో వీటికి మరింత బలం చేకూరింది.
అలా నాగశౌర్య, అనూషల మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి .

కానీ తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసింది అనూష శెట్టి .అసలు ఇవన్నీ రూమర్స్ అని ,తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని,తమ విడాకుల ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కుండ బద్దలు కొట్టేసింది.

మొత్తానికి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విడాకుల రూమర్లకు, తాజాగా ఆయన భార్య అనూష శెట్టి వేసిన పుల్‌స్టాప్‌తో ఈ గాసిప్స్ అన్నింటికీ చెక్ పడినట్లయిందనే చెప్పాలి.

సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో !

ఇక నాగశౌర్య కెరీర్ విషయానికి వస్తే కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో జర్నీ ప్రారంభించిన ఆయన, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘కళ్యాణ వైభోగమే’, ‘జో అచ్యుతానంద’, ‘ఛలో’, ‘ఓ బేబీ’ వంటి వరుస విజయాలతో లవర్ బాయ్‌గా యూత్ లో మంచి క్రేజ్ కొట్టేశారు.. ముఖ్యంగా స్వయంగా నిర్మించిన ‘ఛలో’ సినిమా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలవడం విశేషం.

ALSO READ:పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం నాగశౌర్యకు మాత్రం సాలిడ్ హిట్స్ ని అందించలేకపోయాయి.‘నర్తనశాల’, ‘లక్ష్య’, ‘రంగబలి’ వంటి చిత్రాలతో డిఫరెంట్ గా ట్రై చేసినప్పటికీ హిట్ ని పలకరించలేకపోయాడు.చూడాలి మరి ముందు ముందు చేసే సినిమాలైనా ఈ యంగ్ హీరోని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో !

Tags

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×