Mrunal Thakur:మృణాల్ ఠాకూర్..పరిచయం అక్కరలేని పేరిది.దుల్కర్ హీరోగా వచ్చిన సీతారామంలో ఈ అమ్మడు ఇచ్చిన ఫెర్ఫామెన్స్ టాప్ నాచ్.అయితే ఆ తరువాత తెలుగులో హయ్ నాన్న ,డెకాయిట్ అంటూ పలు సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయి ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
అయితే తెలుగుని దూరం పెట్టినప్పటికీ హిందీలో ‘డూ దీవానే షహర్ మే’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అంటూ పలు సినిమాల్ని పట్టేసి బిజీగానే ఉంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ తన ఇన్స్టా లో పెట్టిన ఒక గ్లామరస్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ట్రెడిషనల్ టచ్‌తో మోడ్రన్ గ్లామర్ మిక్స్
రెడ్ కలర్ డ్రెస్‌లో ట్రెడిషనల్ టచ్‌తో పాటు మోడ్రన్ గ్లామర్‌ను మిక్స్ చేసిన ఆ లుక్ నెటిజన్లను ఫిదా చేస్తుంది. ముఖ్యంగా డైమండ్ చోకర్, గ్రీన్ స్టోన్‌తో ఉన్న ఇయర్ రింగ్స్, సింపుల్ హెయిర్ స్టైల్ ఆమె మొత్తం లుక్‌కు మరింత రిచ్‌నెస్ తీసుకొచ్చాయనే చెప్పాలి.
ఇక ఈ ఫొటోకు మృణాల్ పెట్టిన “They told me red was my colour. I think we’ve made it official…” అనే క్యాప్షన్ కూడా ఫొటోకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు ఫాలోవర్స్.
బోల్డ్ కలర్స్‌లో ఫొటోషూట్స్
సినిమాల్లో డీసెంట్ పాత్రలతో కనిపిస్తూ వచ్చిన మృణాల్, ఫ్యాషన్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఇలా తన ముద్ర వేస్తూనే ఉంది. ముఖ్యంగా రెడ్, బ్లాక్, వైట్ వంటి బోల్డ్ కలర్స్‌లో ఆమె చేసే ఫొటోషూట్స్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా అదే రేంజ్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా హడావుడి లేకుండా చాలా క్లాసీగా కనిపించడమే మృణాల్ లుక్‌కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
కెరీర్ విషయానికి వస్తే
ఇక మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే సీరియల్స్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామా లవ్ సోనియా’ లాంటి ఒక సీరియస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది.
ఆ తర్వాత ‘సూపర్ 30’, ‘బట్లా హౌస్’, ‘జెర్సీ’, ‘తూఫాన్’, ‘ధమాకా’, ‘గుమ్రా’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ సత్తా చాటింది.అయితే ఎన్ని సినిమాలు చేసినా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమా ఈ భామ ఇమేజ్ ని ఒక్కసారిగా ఆకాశంలో పెట్టిసింది.
రెడ్ నిజంగానే నీ కలర్ మృణాల్
మొత్తానికి ఈ కొత్త రెడ్ లుక్‌తో మృణాల్ మరోసారి సోషల్ మీడియాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. . ఒకవైపు వెండితెరపై నటిగా మెప్పిస్తునే , మరోవైపు సోషల్ మీడియాలో తనదైన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. అందుకే నెటిజన్లు కూడా ఈ ఫొటోలు చూసి “రెడ్ నిజంగానే నీ కలర్ మృణాల్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మృణాల్ ఫాన్స్ !
ALSO READ:ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!