E-Paper
Advertisement

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!
Advertisement

Khushi Mukherjee:సినిమా ఇండస్ట్రీ…ఇక్కడ నిలబడాలంటే చాలా కష్టం.దారి ఎంత క్లియర్ గా ఉంటుందో కనిపించని గతుకులు అంత ఉంటాయి.అలాంటి ఏ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అడుగడుగునా ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు .ఎందరి అనుభవాలో వీటికి బెస్ట్ ఉదాహారణలు గా నిలిచాయి కూడా.

ఇక తాజాగా ఇదే విషయాన్నీ బయటపెట్టింది నటి కం మోడల్ అయినా ఖుషీ ముఖర్జీ .ఈవిడ చేసిన క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

విషయంలోకి వెళ్తే టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఖుషీ ముఖర్జీ దేన్నైనా ఓపెన్ గా మాట్లాడుతుంది అన్న  బోల్డ్ ఇమేజ్‌ సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో

Advertisement

ఇక ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తూ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను ఎదుర్కొన్న చేదు నిజాలను బయటపెట్టేసింది .

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలను టార్గెట్ చేసుకుని కొందరు వ్యక్తులు అవకాశాల పేరుతో వ్యక్తిగత కోరికలు తీర్చుకోవాలని చూస్తుంటారని ఆరోపించింది.

. టాలెంట్, కష్టపడే తత్వంతో సంబంధం లేకుండా, ఇలా అసభ్యంగా తమ తమ కోరికలని షరతులుగా పెట్టడం సరైన పద్ధతి కాదని ఆమె స్పష్టం చేసింది . ఇలాంటి పరిస్థితుల వల్ల నిజమైన ప్రతిభ ఉన్న కొత్త కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

కావాలంటే ఓ డమ్మీ బొమ్మను తీసుకొచ్చి

అయితే అలాంటి ప్రతిపాదనలు ఎదురైనప్పుడు తాను భయపడి వెనకడుగు వేయలేదని తెలిపింది . తనపై ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే, వాళ్లకు అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది . కావాలంటే ఓ డమ్మీ బొమ్మను తీసుకొచ్చి,దానికి తన ఫొటో తగిలించుకుని ఊహించుకోవాలంటూ గట్టిగా ఇచ్చిపడేసేదాన్నని మండిపడింది.

అంతేకాకుండా హైదరాబాద్‌లో తనకు ఎదురైన ఓ దారుణమైన ఘటన గురించి ఖుషీ సెన్సేషన్ కామెంట్స్ చేసింది. ఒక దర్శకుడు తనను నమ్మించి, మోసం చేసి ఒక రాత్రి కోసం ఒక నిర్మాతకు అప్పగించేందుకు ప్రయత్నించాడని వాపోయింది.

కాస్టింగ్ కౌచ్ గురించి ఖుషీ మాట్లాడటంతో గతంలో ఈ అంశంపై గళం విప్పిన మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ఇపుడు మరోసారి వార్తల్లో వినిపిస్తున్నాయి .

పరిశ్రమలోని తమ అనుభవాలను

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రవీనా టాండన్ వంటి స్టార్స్ పరిశ్రమలోని తమ అనుభవాలను ఇలాగే బయటపెట్టగా  సౌత్ ఇండస్ట్రీలోనూ కొంతమంది ఇలా ఓపెన్ గా చెప్పడం మనకి తెల్సిందే.

అయితే ఒకరిద్దరు చేసే పనుల వల్ల పరిశ్రమ మొత్తం చెడ్డదని భావించడం సరికాదని వేలాది మంది నిర్మాతలు, దర్శకులు, కళాకారులు తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకునే పనిచేస్తున్నారని ,కాకపోతే కొత్తగా వచ్చేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూస్తుంటారని కొందరుఇండస్ట్రీ కి సపోర్ట్ గా మాట్లాడుతుండటం విశేషం.

ఏది ఏమైనా ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. !

ALSO READ:టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

Tags

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×