E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ సిటీ.. మహిళతో వల వేశారు.. అడ్డంగా బుక్కైన టెక్కీ, ఏకంగా ఎంతంటే..

Hyderabad Crime: హైదరాబాద్ సిటీ.. మహిళతో వల వేశారు.. అడ్డంగా బుక్కైన టెక్కీ, ఏకంగా ఎంతంటే..
Advertisement

Hyderabad Crime: ఆశ.. మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. తేడా వస్తే మునిగిపోతాము కూడా. ఆ టెక్కీ విషయంలో అదే జరిగింది. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశ పడ్డాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్నారు. ఏకంగా రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగుచూసింది.  ఈ కేసుకు సంబంధించి ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

మహిళ ఫోటోతో వల.. సైబర్ నేరగాళ్లకు చిక్కిన ఓ టెక్కీ

Advertisement

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఎక్కువగా హైదరాబాద్ సిటీలోని వివిధ రంగాలకు చెందినవారిని టార్గెట్ చేశారు.. చేస్తున్నారు కూడా. మహిళల ప్రొఫైల్‌ ఫొటోతో కొందర్ని టార్గెట్ చేశారు. ఆ విధంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కాడు ఏకంగా రెండు కోట్లకు పైగానే పొగొట్టుకున్నాడు.

సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల వివరాలు మేరకు.. టీఎన్‌జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల టెక్కీకి సోషల్ మీడియా ద్వారా గతేడాది డిసెంబరులో ఓ మహిళ పరిచయం అయ్యింది. ఆ తర్వాత రోజూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్టాక్‌ ట్రేడింగ్‌ ద్వారా భారీగా లాభాలు వస్తున్నట్లు టెక్కీకి చెప్పింది ఆ మహిళ. ఆమె మాయమాటలకు పడ్డాడు ఆ టెక్కీ.

Advertisement

రెండు కోట్లు పొగొట్టుకున్నటెక్కీ, చివరకు ఆ విధంగా బయటకు

ఆ తర్వాత ఫోన్ వచ్చిన లింక్ ఓపెన్ చేసి యాప్‌‌ని డౌన్‌లోడ్‌ చేశాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించింది సైబర్ మహిళ. తొలుత డిసెంబరు సెకండ్ వీక్ లో 31 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించింది. లాభాలు భారీగా రావడంతో మరిన్ని పెట్టుబడులు పెడితే ఇంకా వస్తాయని చెప్పింది. నిజమేనని నమ్మేసిన ఆ టెక్కీ, రూ.42 లక్షలు బదిలీ చేశాడు.

డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో లాభంలో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాల్సి ఉందని సూచన చేసింది. దీంతో మరింత పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆఫీసులో తోటి ఉద్యోగుల నుంచి 90 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. కుటుంబసభ్యుల వద్ద నగదుతోపాటు కొన్ని ఆస్తులు అమ్మాడు. ఏకంగా 8 దఫాల్లో రెండుకోట్ల రూపాయలకు పైగానే సైబర్ మహిళకు పంపాడు.

ALSO READ: శ్రీరామ శోభాయాత్రలో అపశృతి.. కడుపులోకి దూసుకెళ్లిన టపాసు.. 

చివరకు డబ్బు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా అదనంగా రూ.68 లక్షలు కట్టాలని చెప్పింది. చివరకు మోసపోయినట్లు గమనించిన టెక్కీ, సదరు మహిళ ఫొటోను నెట్లో వెతకడం మొదలుపెట్టాడు. చివరకు ఇన్‌స్టాలో ఓ ప్రొఫైల్‌ నుంచి సేకరించినట్లు గుర్తించాడు. నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి తనను మోసం చేసినట్లు తెలుసుకున్నాడు. చివరకు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×