E-Paper
Advertisement

Adah Sharma: నన్ను చాలామంది చంపాలనుకున్నారు.. ఎందుకంటే

Adah Sharma: నన్ను చాలామంది చంపాలనుకున్నారు.. ఎందుకంటే
Advertisement

Adah Sharma: అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోవచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయితే అదా ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని ఒక సినిమాతో కాకపోతే ఇంకో సినిమాతో అయినా హిట్ అందుకుంటుందేమో అనుకున్నారు. అదా మాత్రం సెకండ్ హీరోయిన్ గా మారిపోయి పలు సినిమాల్లో నటించింది. అవి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక దీంతో అమ్మడు టాలీవుడ్ నుంచి దూరమై బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ యాక్షన్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

కోలీవుడ్ లో అదా చేసిన కేరళ స్టోరీ రికార్డులు సృష్టించింది. వివాదాల మధ్యనే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక కేరళ స్టోరీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత అదా అలాంటి వివాదాస్పద సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. దీనివలన ఆమె పేరు మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇలాంటి వివాదాల వలన ఆమెను ఎంతోమంది చంపాలనుకున్నారని అదాఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” నేను 1920 గాయత్రీ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. అది కూడా చాలా సాహసోపేతమైన కథ. రిస్క్ ఉన్న పాత్రలు చేస్తేనే మన విలువ పెరుగుతుంది. 1920 గాయత్రీ సినిమా తరువాత ది కేరళ స్టోరీ సినిమా వచ్చేవరకు కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథ కోసం ఎదురుచూస్తున్నాను. కేరళ స్టోరీతో ఆ  ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఈ సినిమాతో నా కెరీర్ మారిపోయింది. ఇక దాని తరువాత బస్తర్, ది నక్సల్ స్టోరీ చేశాను. ఇవి కూడా వివాదాస్పదంగా మారాయి. దీనివలన నన్ను దేశంలోని సగంమంది చంపాలనుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు.

నిజం చెప్పాలంటే వారి వలనే నేను బతికి ఉన్నాను. రిస్క్ తీసుకున్నప్పుడే మన పేరుబయట వినపడుతుంది. విభిన్నమైన పాత్రలనే నేను ఎంచుకుంటాను. అందులో యాక్షన్ ఉండాలి. ఎమోషన్ ఉండాలి. అలాంటివి చూసినప్పుడు నా కుటుంబం నన్ను చూసి ఆందోళన చెందాలి. అలాంటివి లేకపోతే నటించినట్లు ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×