E-Paper
Advertisement

Rangareddy Crime: లవ్ మ్యారేజ్‌లో ఇన్‌స్టా చిచ్చు.. ఏం జరిగిందో తెలుసా? రంగారెడ్డి జిల్లాలో దారుణం

Rangareddy Crime: లవ్ మ్యారేజ్‌లో ఇన్‌స్టా చిచ్చు.. ఏం జరిగిందో తెలుసా? రంగారెడ్డి జిల్లాలో దారుణం

Rangareddy Crime: పెద్దల చేసిన వివాహం.. ప్రేమ పెళ్లైనా పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి వివాహేతర సంబంధాలు. ఫలితంగా హత్య చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దారుణంగా చంపేసింది భార్య. చివరకు ప్రియుడితో కలిసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. సంచలనం రేపిన ఈ ఘటన రంగా‌రెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. లవ్ మ్యారేజ్‌లో ఇన్‌స్టా చిచ్చు

సోషల్‌మీడియా పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన బయటకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన కృష్ణ- జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని ప్రేమించాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.

చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలోకి ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. రాజేశ్వరికి ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి ఉంది. నిత్యం ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండేది. ఇదే క్రమంలో శరత్ అనేవ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఈ విషయం తెలిసిన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని రాజేశ్వరి.. ప్రియుడు శరత్ చెవిలో ఊదింది. దీంతో కృష్ణను తొలగించాలని ఇద్దరు స్కెచ్ వేశారు. మనశ్శాంతి కోసం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో గొడవ పడింది రాజేశ్వరి. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడు శరత్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

తొలుత కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కృష్ణ ఛాతీపై శరత్ బలంగా కొట్టడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఘటన తర్వాత ఏమీ తెలియనట్లు వ్యవహరించింది రాజేశ్వరి. శుక్రవారం ఉదయం తన భర్త నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది.

ALSO READ: భర్త ప్రియుడిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య, అసలేం జరిగిందంటే?

కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. ఈ ఘటన తెలిసి కృష్ణ తల్లిదండ్రులు షాకయ్యారు. రాజేశ్వరిపై అనుమానం వ్యక్తం చేశారు. తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, రాజేశ్వరిని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×