America: అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా దారుణహత్యకు గురయ్యారు. ఆయనను భారతీయుడు పొడిచి చంపేశాడు. తన మామలా కనిపిస్తున్నాడనే కారణంతో హత్యకు పాల్పడినట్టు నిందితుడు తెలిపాడు. వెంటనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్ సిటీలో విషాదకర ఘటన జరిగింది. స్థానిక బస్సులో ప్రయాణిస్తున్నారు 30 ఏళ్ల వ్యాపారవేత్త అక్షయ్‌గుప్తా. మరో భారతీయుడు ఆయనపై దాడి చేసి చంపేశాడు. అక్షయ్ గుప్తా ప్రతిభావంతుడైన విద్యార్థి. పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఆయన కలిశారు.
తన స్టార్టప్‌ను కొనసాగించడానికి అతను ఇటీవల అమెజాన్ నుండి వచ్చిన ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించాడు. సైన్స్‌లో అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మక O-1A వీసాను అందుకున్నాడు కూడా. హెల్త్ టెక్ స్టార్టప్ సంస్థ సహ వ్యవస్థాపకుడు.
మే 14న ఆస్టిన్ సిటీలోని స్థానిక బస్సులో ప్రయాణిస్తున్నాడు. అయితే బస్సు వెనుక వేరే సీట్లో కూర్చొన్నాడు మరో భారతీయుడు దీపక్ కండే. ఏం జరిగిందో తెలీదు ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న కత్తితో గుప్తాపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
ALSO READ: కారు-డీసీఎం ఢీ.. స్పాట్‌లో ముగ్గురు మృతి
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుడు దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బస్సులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పోలీసుల విచారణలో నిందితుడు దీపక్ కండేల్ ఊహించలేని నిజాలు చెప్పాడు. అక్షయ్ గుప్తా తన మామలా కనిపించాడని కోపంతో కత్తితో పొడిచి చంపానని అంగీకరించాడు. దీపక్ మామ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తన మామపై అంతగా పగ ఎందుకు పెంచుకున్నాడు? అనేది విచారణలో తేలనుంది.