Harihara Veeramallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత తొలిసారి ఇండస్ట్రీలోకి ‘హరిహర వీరమల్లు’ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఈ తొలి చిత్రం నుండి తాజాగా “అసుర హననం “అంటూ ఒక పవర్ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, రెండు పాటలు ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయ్. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో సాంగ్ అసుర హననం అంటూ సాగుతున్న ఈ పాట చూసేవారికి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆ రౌద్రం మరింతగా రక్తాన్ని వేడెక్కించేలా అనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ తన సినిమాతో అభిమానులకు మంచి కన్నుల విందు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల ఈ పాట రాయగా.. ఐరా ఉడిపి, కాలభైరవ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ ఆలపించారు.
సాంగ్ అదుర్స్.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..
ఇకపోతే తాజాగా హరిహర వీరమల్లు నుండి విడుదల చేసిన ఈ మూడవ పాట చాలా అద్భుతంగా ఉంది..ముఖ్యంగా కీరవాణి అందించిన సంగీతానికి.. కాలభైరవ గానం పాటను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పవచ్చు. కళ్ళకు కట్టినట్టుగా స్వరాలు అంతే అద్భుతంగా సమకూర్చారు రాంబాబు. సాంగ్ విషయానికి వస్తే.. “ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం.. గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం” అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సాంగ్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మొత్తానికి అయితే థియేటర్లలో ఈ సాంగ్ కచ్చితంగా చప్పట్లు, విజిల్స్ తో మోగిపోతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారిన ఈ పాటను మళ్లీ మళ్లీ ప్లే చేసి అభిమానులే కాదు సినిమా ఆడియన్స్ కూడా వింటున్నారు అని చెప్పవచ్చు .
హరిహర వీరమల్లు విశేషాలు..
ఎప్పుడో 2020లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదటి భాగం పార్ట్ పూర్తయింది. ఇక జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏ.ఎమ్. రత్నం నిర్మాణంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. మొత్తానికి అయితే జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:HBD Abbas: స్టార్ హీరో నుండీ టాక్సీ డ్రైవర్ దాకా.. పదేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ..!