Hayathnagar Incident: హయత్‌నగర్ కుంట్లూర్ దగ్గర ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న డీసీఎం ను కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సమీపంలోని సీసీ కెమారాలో రికార్డు అయ్యా్యి. అతి వేగంగా వచ్చిన కారు డీసీఎం ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం గాల్లోకి ఎగిరింది. అయితే మృతులంతా యువకులుగా గుర్తించారు.
అయితే నలుగురు యువకులు కూడా నిన్న అంబర్‌పేట్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి 9 గంటల ప్రాంతంలో వచ్చి సరదాగా ఫామౌస్‌కి వెళ్దామని సన్నిహితులు నలుగురు కూడా ఫామౌస్‌కి వెళ్ళారు. తిరిగి తెల్లవారు జామున ఇంటికి వెళ్దామని వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు యవకుల కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కోక్క కూమారుడే.. ఈ ఘటన వాళ్ల్ వారు వాల్ల ఒక్క కూమారుడిని కూడా కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోకరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు.
Also Read: నకిలీ పెళ్లికొడుకు వేషంలో పోలీస్.. ఆ యువతిని ఏం చేశాడంటే
ఈ నలుగురు పసుమాముల నుండి నలుగురు యువకులు కారులో బయల్దేరారు. కుంట్లూరు దగ్గర రాంగ్‌రూట్‌లో స్పీడ్‌గా వెళ్లి DCMను ఢీకొట్టారు. కారు వేగానికి DCM గాల్లోకి లేచింది. మృతులను చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు.