Indore Horror: ఎంబీఏ యువతి రెండు రోజులుగా మిస్సింగ్ అయ్యింది. ఆరా తీయగా బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో శవమై తేలింది. ఈ ఘటన తర్వాత బాయ్‌ఫ్రెండ్ సైతం కనిపించలేదు. సంచలనం రేపిన ఈ ఘటన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో జరిగిన ఈ ఘటనలో అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్దిని ఫిబ్రవరి 11న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్నేహితుల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుందని తెలిపింది. సరేసని యుతి పేరెంట్స్ అన్నారు. యువతి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ సమయంలో యువతి మొబైల్ నుంచి అభ్యంతరకర వీడియో కాలేజ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయ్యింది. అయితే ఆ వీడియోను కాలేజీ యాజమాన్యం డిలీట్ చేసింది. కనిపించకుండా పోయిన యువతితోపాటు ఇద్దరు యువకులు ఉన్నారు. ఒకడు క్లాస్‌మేట్ కాగా, మరొకడు ఆమె ప్రియుడు పీయూష్ ధనోటియా. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తేలింది.
ప్రియురాల్ని చంపి.. ఆమె ఆత్మ కోసం ప్రియుడు క్షుద్రపూజలు
తనను వివాహం చేసుకోవాలని యువతి.. తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చేది. అందకు పీయూష్ నిరాకరిస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఫ్రెండ్ బర్త్ డే మరుసటి రోజు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో ప్రియురాలి గొంతు నులిమి చంపేశాడు పీయూష్. ఇండోర్‌లోని ద్వారకాపురి ఏరియాలో అద్దెకు ఉండేవాడు పియూష్ ధనోటియా. తన ప్రియురాలితో అక్కడే కలిసేవాడు ప్రియూష్.
హత్య చేసిన తర్వాత యువతి మృతదేహాన్ని రూమ్‌లో ఉంచి వెళ్లిపోయాడు. రూమ్ నుండి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్, స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా యువతి మృతదేహం మంచంపై ఉంది. యువతి గొంతుపై తాడులాంటి దానితో నొక్కి చంపినట్లు గుర్తులు కనిపించాయి.
ALSO READ: కాలం మారుతున్నా.. దశావతారాల నీతి ఎప్పటికీ సజీవం!
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పీయూష్ మాత్రం కనిపించకపోవడంతో గాలింపు మొదలుపెట్టారు. యువతి హత్య తర్వాత మహారాష్ట్రకు పారిపోయాడు. ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తూ యూట్యూబ్‌లో ఆత్మలను ఎలా పిలవాలనేది తెలుసుకున్నాడు.
మహారాష్ట్ర పోలీసుల సాయంతో ఆచూకీ గుర్తించారు పోలీసులు. అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత తాంత్రిక పూజలు చేయడం మొదలుపెట్టాడు. చనిపోయిన ప్రియురాలి ఆత్మతో మాట్లాడాలని ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులు తెలిపారు.