
ISIS India Head Haris Farooqi arrested: ఐసిస్ ఉగ్రవాద గ్రూప్‌కు అస్సాం టాస్క్‌ఫోర్స్ షాకిచ్చింది. ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ షారూఖీని చాకచక్యంగా అరెస్ట్ చేసింది. అతడితోపాటు ఆయన సహాయకుడు రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫారూఖీ.. దుభ్రీలోకి విధ్వంసక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ నిఘా వేసి అతడ్ని అదుపులోకి తీసుకుంది.
బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌లో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నాడని అధికారుల దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రిస్టుల జాబితాలో హరీస్ షారూఖీ పేరు ఉంది. ఇండియా-బంగ్లాదేశ్ బోర్డర్‌లో ఐసిస్ ఉగ్రవాదులున్నట్లు తమకు సమాచారం ఉందని అస్సాం టాస్క్‌ఫోర్స్ ఐజీ పార్థసారథి మహంతా తెలిపారు. మూడు రోజుల కిందట ఉగ్రవాదులు సరిహద్దు దాటే క్రమంలో మా టీమ్ వారిని అరెస్ట్ చేసిందన్నారు. ఐసిస్ విస్తరణలో భాగంగా భారత్‌లో కొత్తగా నియామకాలు చేపట్టడానికి ఫారూఖీ కుట్ర పన్నాడన్నది ప్రధానంగా ప్రస్తావించారు.
అంతేకాదు భారత్‌లోని పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు దర్యాప్తు వెల్లడైంది. ముఖ్యంగా ఢిల్లీ, లక్నో సిటీల్లో ఫారూఖీపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏకు అప్పగించినట్టు ఐజీ తెలిపారు. అన్నట్లు హర్యానాలోని పానిపట్‌కు చెందిన రెహ్మన్ అసలు పేరు అనురాగ్‌సింగ్. ఇస్లాంలోకి మారాక హరిస్ ఫారూఖీగా పేరు మార్చుకున్నాడు. ఆయన వైఫ్ బంగ్లాదేశ్ జాతీయురాలు.