Pet Dog Killed: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. పెంపుడు కుక్క పిల్లలను చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్.. అతి దారుణంగా వ్యవహరించింది. కుక్క పిల్లను లిఫ్ట్ లో నేల కేసి కొట్టి చంపింది. కోపంతో పని మనిషి కుక్కపిల్లను ఘోరంగా చంపిన దృశ్యాలు లిఫ్ట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
బెంగళూరులోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నవారు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. తమ కుక్క పిల్లను చూసుకునేందుకు పెట్టుకున్న ఆమె మహిళ అతి కిరాతకంగా వ్యవహరించింది. బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ లోపల తన యజమాని పెంపుడు కుక్క పిల్లను చంపినందుకు 29 ఏళ్ల మహిళను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతిని తమిళనాడుకు చెందిన పుష్పలతగా గుర్తించారు. ఆ యువతిని ఎంబీఏ విద్యార్థిని అయిన రషిక తన పెంపుడు కుక్క పిల్లలను చూసుకోవడానికి నియమించుకుంది.
పుష్పలత నెలన్నరగా రషిక ఇంట్లో పనిచేస్తుంది. ఆమెకు నెలకు రూ. 23,000 జీతం, అదే అపార్ట్‌మెంట్‌లో వసతి కూడా కల్పించారు. బెంగళూరు పోలీసుల ప్రకారం, పుష్పలత కుక్క పిల్లను లిఫ్ట్ లోపల దారుణంగా నేలకేసి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయింది. నవంబర్ 1న పుష్పలత రెండు కుక్క పిల్లలను నడకకు తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. తిరిగి వస్తుండగా.. ఆమె లిఫ్ట్‌లోకి ఎక్కింది. పెంపుడు కుక్క పిల్లల్లో ఒకటైన గూసిని పుష్పలత లిఫ్ట్ లో బలంగా నేలకేసి కొట్టింది. అనంతరం అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చి, కుక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని రషికకు చెప్పి నమ్మించింది. పుష్పలత తీరుపై అనుమానం వచ్చిన రషిక అపార్ట్‌మెంట్ యాజమాన్యం సహాయంతో సీసీటీవీ కెమెరాలను చెక్ చేసింది. పుష్పలత కుక్క పిల్లను అతి దారుణంగా కొట్టిన దృశ్యాలు చూసి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
#Bengaluru shocking case of animal cruelty as a woman hired for ₹23,000 per month to take care of a pet dog was caught on CCTV brutally killing the dog inside an apartment lift.
Bagaluru Police have arrested her. She confessed to doing it out of anger. pic.twitter.com/xfVas9rG4F— Elezabeth Kurian (@ElezabethKurian) November 3, 2025
Also Read: Coimbatore Gang Rape Case: కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులపై నిందితులు దాడి, ఆపై కాల్పులు
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కుక్క పిల్లలు నిరంతరం మొరగడంతో తాను విసుగు చెంది ఇలా చేశానని ఒప్పుకుంది. ఆమె ఇటీవల యజమాని ఇంటి నుండి విలువైన వస్తువులను దొంగిలించడంతో.. రషిక కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఇందుకు ప్రతీకారంగా పుష్పలత పెంపుడు కుక్క పిల్లను చంపిందని రషిక కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.