Vikarabad Crime: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ సమీపంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వల్ప నష్టం జరగగా.. పెను ప్రమాదం తప్పినందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుల్బర్గా నుంచి తాండూర్ వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ తలకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు, ప్రయాణికులు గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది.
పరారీలో లారీ డ్రైవర్..
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా కొంత సమయం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అయితే.. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో తిరిగి రాకపోకలు యథావిధిగా సాగాయి. తాండూర్ సమీపంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ALSO READ: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు