E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement

Road Accident: చత్తీస్‌గఢ్ లోని జష్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. దుల్దులా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటోలి సమీపంలో ట్రక్కును కారు ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తులు జశ్‌పూర్ జిల్లా చరైదంద్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి సమీప పట్టణానికి వెళ్తుండగా ఈ ప్ర‌మాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.  కారు అధిక వేగంతో వస్తుండగా ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

ఇదిలా ఉంటే.. లాలాగూడ పీఎస్ పరిధిలోని లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వాళ్లు మల్కాజ్గిరి కి చెందిన హర్షిత్ రెడ్డి(22), చెంగిచర్ల కు చెందిన శివమణి (23)గా గుర్తించారు పోలీసులు.నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకకు టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×