E-Paper
Advertisement

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

  1. హైదరాబాద్‌లో మొత్తం 115 విమానాలు రద్దు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇవాళ 115 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇరుముడి కట్టుకొని వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో.. శబరిమలకు ఎలా వెళ్లాలంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో హర్షిత్ రెడ్డి, శివమణి అనే ఇద్దరు యువకులు మరణించారు. కీసర నుంచి తార్నాకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు.

3. మంత్రి సీతక్క స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం

ములుగు జిల్లాలోని మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపర్చిన అర్రెం వెంకన్నను గ్రామ పెద్దలు ఎన్నుకున్నారు. తన ఆశీర్వాదంతో ఎన్నికైన వెంకన్నకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

4. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పువ్వాడ అజయ్

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎగ్గొట్టిందని, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే రైతు బంధు సక్రమంగా ఇచ్చామని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోనిచ్చారు. కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు.

5. పర్యాటకులతో నిండిన అరకు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక కేంద్రం అరకులోయ పర్యాటకలతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావడంతోపాటు, అరకులోయలో మంచు విపరీతంగా కురుస్తుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. పర్యాటక వాహనాలతో అరకులోయ ప్రధాన రహదారి నిండిపోయి, ప్రాంతమంతా సందడిగా మారింది.

6. డ్రగ్స్ వద్దు బ్రో… సైకిల్ తొక్కు బ్రో

గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో… సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని ఈగల్ చీఫ్ రవికృష్ణ, కలెక్టర్, ఎస్పీ కలిసి ప్రారంభించారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తోందని, యువత భవిష్యత్తును కాపాడుకోవాలని రవికృష్ణ కోరారు.

7. వేగంగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు

అమరావతి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పూర్తైంది. ఇటీవల భూసేకరణ సమస్యలు పరిష్కారం అయ్యి. రెండో దశ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తి అయితే కరకట్ట పై కొత్త వరకు వాహనాల రద్దీ తగ్గుతుంది.

8. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ అధికారులు, ఉద్యోగులపై సిట్

తిరుమల లడ్డూలకు సంబంధించిన కల్తీ నెయ్యి కేసులో టీటీడీ అధికారులు, ఉద్యోగులపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ జీఎం, ఈఈ సుబ్రమణ్యాన్ని సిట్ అరెస్ట్ చేసింది. కేసులో ప్రమేయం ఉండి, ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సిట్ ఉన్నతాధికారులు టీటీడీకి పంపారు.

9. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మద్దతు

గూడూరు మండలం చిన్న ఎల్లాపురంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి స్థానిక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మద్దతు పలకడం వింతగా మారింది. రాష్ట్ర స్థాయిలో వైరం ఉన్నా.. గ్రామ స్థాయిలో ఈ మూడు పార్టీల స్నేహం చూసి ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

10. దేవాలయాల్లో దొంగతనాలు కలకలం..

మంచిర్యాల జిల్లాలోనీ ఒకే గ్రామంలో రెండు దేవాలయల్లో దొంగతనం జరిగిన ఘటన కలకలం రేపింది. రాపల్లి గ్రామంలో శివాలయం, రేణుక ఎల్లమ్మ రెండు గుళ్ళలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జాగిలాలతో, క్లూస్ టీం ధ్వారా ఆధారాలు సేకరించారు. త్వరలో దొంగలను పట్టుకొనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

11. మదనపల్లి పైల్స్ దగ్ధం కేసులో మాధవరెడ్డి

మదనపల్లి పైల్స్ దగ్ధం కేసులో ఏ1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి కోసం సీఐడీ గాలిస్తోంది. ఇటీవల హైకోర్టు సీఐడీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అరెస్టుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

12. కోళ్ల షెడ్డు, కారు, బడ్డీ కొట్టు దగ్ధం చేసిన కేసులో నిందితు అరెస్ట్..

భీమడోలు మండలం పూళ్ళలో పాత కక్షల కారణంగా ఇసాక్ కోళ్ల షెడ్డు, కారు, బడ్డీ కొట్టు దగ్ధం చేసిన కేసులో పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బొల్లారపు పవన్ రాజ్ కుమార్ సహా నిందితులను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.

13. ఘోర రోడ్డు ప్రమాదం..

తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వేగం కారణంగా రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. గుంటూరు నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది అయ్యప్ప స్వాములు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

14. సత్య సాయి జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారుల అంతులేని నిర్లక్ష్యంతోనే ప్రజలు కుక్కల దాడిలో గాయపడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

15. గోవా అగ్నిప్రమాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మరణించడం బాధాకరమన్నారు రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఇది భద్రత, పాలన నేరపూరిత వైఫల్యమని, సమగ్ర దర్యాప్తు జరిపి జవాబుదారీతనం నిర్ధారించాలని, ఇటువంటి విషాదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

16. గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దెయ్యాలతో పోరాడుతోంది-అహ్మద్ అల్-షరా

గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దెయ్యాలతో పోరాడుతోందని, కొత్త శత్రువుల కోసం వెతుకుతోందని సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా దోహా ఫోరంలో ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దూకుడును విమర్శించిన ఆయన.. శాంతి సందేశాలను తిరస్కరించిందన్నారు. సిరియా భూభాగం నుంచి బలగాలను ఉపసంహరించి, 1974 యుద్ధ విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్నారు.

17. కెనడా-అలాస్కా ప్రాంతంలో భారీ భూప్రకంపనలు

కెనడా-అలాస్కా సరిహద్దు ప్రాంతంలో ఇవాళ భారీ భూప్రకంపనలు సంభవించాయి. యూకోన్‌లో సంభవించిన ఈ ప్రకంపనలు వైట్ హార్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించేలా చేశాయి. భూకంప కేంద్రం ఉత్తర జెనీవాకు 230 మైళ్ల దూరంలో ఉంది. ప్రజలు భయాందోళన చెందారు, అయితే ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

18. గోవా అగ్నిప్రమాదంపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్

గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఈ ఘటన మరణించిన వారికి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

19. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి

సినీ నటి ప్రగతి తాజాగా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ విమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో ఆమె నాలుగు పతకాలు సాధించారు. ఇందులో ఒక గోల్డ్ మెడల్తో పాటు మూడు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి.

20. సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సింహాచలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆలయ అధికారులు.. విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కోహ్లీ కప్పస్తంభం వద్ద ఆలింగనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×