E-Paper
Advertisement

Constable Drugs Case: గంజాయి మత్తులో హోటల్ మేనేజర్లు.. ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

Constable Drugs Case: గంజాయి మత్తులో హోటల్ మేనేజర్లు.. ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
Advertisement

Constable Drugs Case: హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న యువకులు, తమ పాత స్నేహితులతో కలిసి రీయూనియన్ పేరుతో విందు చేసుకున్నారు. గచ్చిబౌలి మసీద్ బండాలోని ‘కోవ్ స్టేస్’ హోటల్‌ రూమ్ నెంబర్ 309లో ఈ తతంగం నడిచింది. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన ఈగల్ ఫోర్స్ అధికారులు.. అక్కడ ఏడుగురు యువకులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు.

అయితే అక్కడ తనిఖీ చేసినా మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఐదుగురు గంజాయి సేవించినట్లు పాజిటివ్ అని తేలింది. పట్టుబడిన వారిలో మెఘేందర్, తేజేశ్వర్, సాయి ప్రసాద్, రమేష్‌లతో పాటు.. హైదరాబాద్ కమిషనరేట్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో AR కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రవి కూడా ఉన్నారు.

Advertisement

నిందితులు 2019 బ్యాచ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్ధులుగా గుర్తించారు. పట్టుబడిన వారిలో ప్రముఖ హోటళ్ల మేనేజర్లు ఉన్నారు. ఘటనపై  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి విచారణకు సిద్ధమయ్యారు. వివాహ వేడుకలో గంజాయికి అలవాటు పడినట్లు నిందితులు అంగీకరించారు.

ALSO READ: సైలెంట్‌గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత

Advertisement

Related News

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

Big Stories

Advertisement
×