E-Paper
Advertisement

Human Sacrifice Attempt: గుప్త నిధుల కోసం ఘోరం.. ఏడాది బాలుడి నరబలికి యత్నం! చివరి నిమిషంలో కాపాడిన అధికారులు

Human Sacrifice Attempt: గుప్త నిధుల కోసం ఘోరం.. ఏడాది బాలుడి నరబలికి యత్నం! చివరి నిమిషంలో కాపాడిన అధికారులు
Advertisement

Human Sacrifice Attempt: గుప్త నిధులు కోసం, మూఢ‌న‌మ్మ‌కాల‌తో ప‌సిబిడ్డ‌ల‌ను బ‌లిచ్చిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ఎన్నో చూశాం. తాజాగా గుప్త నిధుల ఆశతో పసిబిడ్డను బలి ఇవ్వబోయిన అమానవీయ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుర్మార్గులు ఏడాది వయసున్న బాలుడిని నరబలి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే, అధికారులకు సకాలంలో సమాచారం అందడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లాలో శనివారం చోటుచేసున్న ఈ ఘ‌ట‌రన‌లో సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మిన కొందరు.. వాటిని దక్కించుకోవాలంటే నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇంటి లోపలే ఒక గొయ్యి తీశారు. ఆ చిన్నారిని బలి ఇవ్వడానికి ముందు చేయాల్సిన పూజా కార్యక్రమాలను ) కూడా మొదలుపెట్టారు. గొయ్యి పక్కన పూలు, అగరబత్తులు, ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేసి క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

ఈ దారుణం గురించి గుర్తుతెలియని వ్యక్తులు అధికారులకు సమాచారం అందించ‌డంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా బాలల రక్షణ విభాగం అధికారులు ఆకస్మికంగా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో తనిఖీలు చేపట్టి, పూజలను మధ్యలోనే అడ్డుకుని ఏడాది బాలుడిని వారు సురక్షితంగా కాపాడారు.

అనంతరం బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిధుల కోసం కన్నబిడ్డనే బలి ఇవ్వాలనుకున్నారా? లేక వేరే వారి బిడ్డను ఎత్తుకొచ్చారా? అసలు ఈ పూజల వెనుక ఎవరున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Read Also: మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి లైంగిక దాడి.. కట్ చేస్తే..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×