Kerala: కష్టపడటానికి ఇష్టంలేని కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బులు, ఉద్యోగం, ఆస్తుల కోసం ఏమైనా చేస్తున్నారు. తల్లి, తోడబుట్టిన వారిని దారుణంగా చంపేస్తున్న ఘటన ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన కేరళలో వెలుగు చూసింది. అసలేం జరిగింది?
దృశ్యం సీన్ కేరళలో రిపీట్
కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పొన్నూట్టిల్ కుటుంబానికి చెందిన సజీ.. సోదరుడు రెజీ, తల్లి మేరీకుట్టితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుటుంబానికి చెందిన సుమారు ఎకరం భూమి ఉంది. దీన్ని పంచుకోవడంపై సోదరుల మధ్య వివాదం సాగుతోంది.
ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు రెజీ. అన్నతో తమ్ముడు సజీకి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగిగింది. రెజీపై దాడి చేశాడు సజీ. ఆ తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. అన్నను టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. అంతటితో తన పగ తీరిందని భావించాడు.
ఈ హత్యను చూసిన తల్లిని సోదరుడి మాదిరిగానే చేశాడు. అన్న, తల్లి చనిపోవడంతో ఏం చేశాడో కాసేపు అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియక రెండు రోజుల పాటు మృతదేహాలను ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత రాత్రివేళ ఇంటి ఆవరణలో గొయ్యి తీసి వారిని పూడ్చిపెట్టాడు. నెలరోజుల వరకు మేరీకుట్టి, రెజీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది.
తల్లి, సోదరుడిని చంపేసి.. ఇంట్లో రెండు రోజులు మృతదేహాలు
సజీని చుట్టుపక్కలవారు అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. మేరీని నిత్యం ఆసుపత్రికి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి సుజీని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని ఆటోడ్రైవర్ తన సోదరికి తెలిపాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రంగంలోకి దిగిన పోలీసులు, సజీ ఇంటికి చేరుకున్నారు. వాళ్లని చూసి పారిపోయేందుకు యత్నించాడు. చివరకు పోలీసులు ఇంటి ఆవరణలో తవ్వకాలు జరిగాయి. రెండు మృతదేహాలు లభ్యం కావడంతో షాకయ్యారు. చివరకు సజీని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట అంటే 2018 లో సజీ తండ్రి మాథ్యూ అదృశ్యమయ్యాడు.
ALSO READ: బీటెక్ పట్టా ఉంది.. కానీ బతుకు భారమైంది.. మంటల్లో మాడిపోయిన యువతి కలలు!
ఆ ఘటనతో తండ్రిని కూడా చంపేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అసలు విషయాలు వెల్లడించాడు నిందితుడు. తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిజం అంగీకరించాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు. ఆస్తి పంపకాల విషయమై ఈ ఘోరానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.