E-Paper
Advertisement

Jetlee Movie Review: జెట్‌ లీ మూవీ రివ్యూ.. హీరోగా గర్జించిన సత్య.. కానీ?

Jetlee Movie Review: జెట్‌ లీ మూవీ రివ్యూ.. హీరోగా గర్జించిన సత్య.. కానీ?
Advertisement

Jetlee Movie Review:ఈమధ్యకాలంలో కమెడియన్స్ హీరోగా కూడా సినిమాలు చేసి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో సత్య కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన తాజాగా హీరోగా మారి నటించిన చిత్రం జెట్‌ లీ. సత్య హీరోగా .. వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అలరించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ హీరోగా కమెడియన్ సత్య మెప్పించాడా అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం..

కథా నేపథ్యం:

ప్రజాపతి (అజయ్) బ్యాంకు దివాలా తీస్తుంది. బాధితులు రోడ్డున పడతారు. అయితే ఈ నష్టాలకు కారణం హరీష్ చంద్ర (శుభలేఖ సుధాకర్) అనే వ్యక్తి కారణం అని, తప్పుడు వార్త సృష్టించి.. ప్రజాపతి 15 వేల కోట్లతో దుబాయ్ కి పారిపోతాడు. ఇతడిని చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజాపతి తానే స్వయంగా లొంగిపోతాడు. ఏజెంట్ శివాని (రియా సింఘా) తన టీం తో కలిసి విమానంలో ప్రజాపతిని ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరుతారు.అదే విమానాన్ని తన మనుషులతో హైజాక్ చేయించి, పారిపోవాలని ప్రజాపతి ప్లాన్ చేస్తాడు. అదే విమానంలో ఉన్న వేద వ్యాస్ (సత్య) వైద్యుడిగా నటించాడు. మరి ప్రజాప్రతి వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా ? వేదవ్యాస్ వైద్యుడిగా ఎందుకు నటించాడు? ప్రజాపతిని చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు? హోంమంత్రి మేల్కోటే (సాయి శ్రీనివాస్) తో బ్యాంకు స్కామ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? హరీష్ చంద్ర , వెన్నెల కిషోర్ పాత్రలు ఏంటి? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

also read:ఓటీటీలోకి వచ్చేసిన రాకాస.. సౌత్ ఇండియా ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్!

విశ్లేషణ:

ఇకపోతే ఇన్ని రోజులు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన సత్య హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రకటించిన రోజు నుంచి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి .ఇందులో సత్య హీరో కాబట్టి రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు అనుకోని థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి నిరాశ తప్పదు. కామెడీ కాస్త పక్కన పెడితే కథను సెట్అప్ చేయడంలో మాత్రం మేకర్స్ తడబడ్డారు. సెటప్ చాలా వీక్ గా ఉండడంతో కథలో ఉండాల్సిన గ్రిప్పింగ్ మిస్ అయింది. సెకండ్ హాఫ్ సాగదీతగా ఉంది. మిస్ ఫైర్ అయిన కామెడీ అని చెప్పాలి. ఇక రెండో భాగంలో సినిమా మొమెంటం పూర్తిగా కోల్పోయింది. కథనం ఎక్కడికక్కడ డ్రాగ్ అవుతుండడంతో పేలిన కామెడీ కూడా ఆ తర్వాత తుస్సుమనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఇక ఇందులో సినిమా మొత్తానికి దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సత్యా మాత్రమే. తన మార్క్ కామెడీ టైమింగ్ తో సినిమాను కాపాడడానికి గట్టిగానే ట్రై చేశాడు.

సాంకేతిక విభాగం:

Advertisement

ఇకపోతే ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఉంది రెండు పాటలే అయినా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్స్ ట్రిమ్ చేయవచ్చు అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి విమానంలో వాతావరణాన్ని బాగా సృష్టించారు. అవి మాత్రం సహజంగా అనిపించాయి.

బలాలు:

సత్య కామెడీ టైమింగ్

సత్య వన్ మ్యాన్ షో

అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్లు బాగా నవ్విస్తాయి.

బలహీనతలు:

ఫెయిల్ అయిన రైటింగ్..

చివరిగా:

రితేష్ రానా మార్క్ మ్యాజిక్ ఈసారి సరిగా పండలేదు. రైటింగ్ లో లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమా మొత్తం గా చూస్తే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. సత్య తన భుజాల మీద సినిమాను మోయాలని చూసినా ఈ సినిమా అదరగొట్టే రేంజిలో అయితే ఏమీ లేదు . ముఖ్యంగా రితేష్ రానా పాత సినిమాలతో పోలిస్తే ఇది ఈ మార్కును అందుకోలేకపోయింది.

  Jetlee Movie Rating : 2/5

Related News

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

Big Stories

Advertisement
×