BigTV English

Samsung Galaxy S23 Ultra Price Drop: కలలో కూడా అనుకోలేదు.. సామ్‌సంగ్ అల్ట్రా‌పై బిగ్ డిస్కౌంట్.. పూనకాలు లోడింగ్!

Samsung Galaxy S23 Ultra Price Drop: కలలో కూడా అనుకోలేదు.. సామ్‌సంగ్ అల్ట్రా‌పై బిగ్ డిస్కౌంట్.. పూనకాలు లోడింగ్!

Samsung Galaxy S23 Ultra Price Drop: దేశీయ టెక్ మార్కెట్‌లో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం సామ్‌సంగ్ ఫోన్లను కెమెరా ఫోన్లను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సామ్‌సంగ్ ఓ శుభవార్త చెప్పింది. గతేడాది కంపెనీ విడుదల చేసిన 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌పై ఇప్పుడు రూ.35 వేల డిస్కౌంట్ లభిస్తుంది.


కంపెనీ S సిరీస్ ప్రీమియం ఫోన్  Samsung Galaxy S23 Ultra 12 GB RAM+256 GB ఇంటర్నల్ స్టోరజ్‌తో గతేడాది రూ.1,49,999కి విడుదల చేసింది. అయితే ఇప్పుడు అమోజాన్ దీనిపై 41 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఫోన్‌ను రూ. 88,900కి కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ EMI రూ.4,310తో కొనుగోలు చేయవచ్చు. అతి తక్కువ నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: రెడ్‌మీ నుంచి బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లు.. జులై 9న లాంచ్!


అంతేకాకుండా  మీరు ఈ ఫోన్‌ను 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ రూ. 59 వేల వరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులపై తగ్గింపు లభిస్తుంది.

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్‌లో కంపె 6.8 అంగుళాల క్వాడ్ HD+ డైనమిక్ AMOLED 2x ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hzకు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 1750 నిట్‌ల పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. 12 GB RAM+256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌లో మీరు Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ని ప్రాసెసర్‌గా చూడవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన నాలుగు కెమెరాలను అందిస్తోంది. వీటిలో 200-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఫోన్ మెయిన్ కెమెరా OIS, HDR ఫీచర్‌తో వస్తుంది.

Also Read: లాంచ్‌కు సిద్ధమైన CMF.. సోమవారమే లాంచ్.. ఎన్ని రంగులు మారుస్తుందో!

సెల్ఫీ కోసం మీరు ఈ Samsung ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్‌ని పొందుతారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కూడిన ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ షోన్ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి చెప్పాలంటే ఈ ఫోన్ Android 13 ఆధారంగా OneUI 5.1లో రన్ అవుతుంది.

Tags

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం.. iFixitలో తక్కువ స్కోరు

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×