Hyderabad Crime: తెలంగాణ వ్యాప్తంగా రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకున్నారు ప్రజలు. అయితే కొత్త ఏడాదిలో పలు ప్రాంతాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బిర్యాని తిని ఒకరు మృతి చెందారు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి
న్యూఇయర్ వచ్చిందంటే ఆ మజాయే వేరు. ఓ వైపు మందు.. మరోవైపు బిర్యానీ మస్తుగా తీసుకుంటారు. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతం జగద్గిరిగుట్ట పరిధిలోని భవానినగర్‌లో ఊహించని దారుణం జరిగింది. సెలబ్రేషన్స్ సందర్భంగా 17 మంది ఓ రేంజ్‌లో పార్టీ చేసుకున్నారు. ఓ వైపు మద్యం సేవించి ఫుల్‌గా చిల్ అయ్యారు.
మరోవైపు బిర్యానీ కూడా ఆ రేంజ్‌లో తీసుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత మృతి చెందడంతో అక్కడున్నవారంతా ఒక్కసారి షాకయ్యారు. ఈలోపు 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కోనసీమ వద్ద సముద్రంలోకి దూసుకెళ్లిన జీప్
మరోవైపు ఏపీలోని కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. న్యూఇయర్ వేడుకలకు అంతర్వేదికి వచ్చారు ఇద్దరు యువకులు. వేడుకల తర్వాత అర్ధరాత్రి సముద్రం సమీపంలో జీప్ డ్రైవింగ్ చేశారు. అయితే సమీపంలోని గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక జీప్‌తో నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది.
పరిస్థితి గమనించిన ఇద్దరు వ్యక్తులు జీప్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో యువకుడు గల్లంతు అయ్యాడు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు కారులో అతడి మృతదేహం లభ్యమైంది. ఈ ప్రమాదం నుంచి సూర్యకిరణ, జయకృష్ణ బయటపడ్డారు. దీంతో యువకుడి కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.
ALSO READ: చాదర్‌ఘాట్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం.. కత్తులతో హల్‌చల్