UP Crime News: ఎన్ని కష్టాలు ఉన్నా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది పుట్టిన నలుగురు పిల్లలను దారుణంగా చంపేశాడు కన్న తండ్రి. చివరకు భార్య శారీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘోరం జరిగింది. మన్పూర్ చాచారి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రాజీవ్ కథేరియా భార్య కాంతి దేవి ఉంటున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు వయస్సు 13 ఏళ్లు కాగా, చివరి సంతానంలో చివరివాడు రిషబ్. కొడుకు వయస్సు ఐదేళ్లు.
నలుగురు పిల్లలతో నిత్యం రాజీవ్ ఇల్లు సందడిగా ఉండేది. వీరిని చూసి తమకు అంతమంది పిల్లలు ఉంటే బాగేందని చాలామంది అనుకునేవారు. రెండురోజుల కిందట రాజీవ్ భార్య పుట్టింటికి వెళ్లింది. నలుగురు పిల్లలు తండ్రి వద్దే ఉన్నారు.
కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య కాంతిదేవి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఒకరు పనికి వెళ్తే గడవని కుటుంబం రాజీవ్ ఫ్యామిలీది. భార్య వెళ్లిపోవడంతో మానసికంగా కుండిపోయాడు. తన సమస్యకు కనీసం తండ్రికి చెప్పకోలేకపోయాడు.
ALSO READ: రూ. 10 ఛాలెంజ్ తెచ్చిన తంటా, 40 చిన్నారుల చేతులు కట్
ఓ వైపు ఇంట్లో ఇబ్బందులు, మరోవైపు విభేదాలు ఇవన్నీ కలిసి మానసిక సంఘర్షణకు లోనయ్యాడు రాజీవ్. పిల్లలు చిన్నప్పుడే ఇలావుంటే పెద్దయితే సమస్యలు రెట్టింపు అవుతాయని భావించాడు. దీనికి చనిపోవడమే పరిష్కారమని భావించాడు. అనుకున్నట్లుగానే నలుగురు పిల్లలతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రపోయాడు.
రాజీవ్ తండ్రి ఇంటి బయట పడుకున్నాడు. గురువారం ఉదయం నిద్ర లేచి ఇంటి తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు. లోపల తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. ఏదో విధంగా ఇంటి లోపలికి వెళ్లాడు. లోపల దృశ్యాలను షాకయ్యాడు రాజీవ్ తండ్రి. తన మనవడు, మనవళ్ళ రక్తంతో తడిసిన మృతదేహాలు కనిపించాడు.
కొడుకు రాజీవ్ శారీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపు ఆయనకు నోటి మాట రాలేదు. తేరుకున్న తర్వాత రాజీవ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఐదుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. లేదంటే భార్య కాంతిదేవిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.