Mangal Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం.. ఏప్రిల్ 3, 2025 నాడు, గ్రహాల అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ అంగారక గ్రహ సంచారం ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 01:32 గంటలకు జరుగుతుంది. కుజ గ్రహం యొక్క ఈ రాశి మార్పు 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి కుజుడి సంచారం అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. మరి కుజుడి గ్రహ సంచారం వల్ల ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
కుజుడి సంచారం ఏప్రిల్ 3 న జరగనుంది. ఈ సంచారము మిథున రాశి వారికి ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా మీ పెండింగ్ పనులు పూర్తయ్యే బలమైన అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు రావడం ద్వారా ఊహించని ఆదాయం లభిస్తుంది. ఇది ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి తెలివిగా ముందుకు సాగాలి. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. మీ వైవాహిక జీవితం కూడా ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి:
కుజుడి సంచారం కర్కాటక రాశి వారిని ప్రభావితం చేస్తుంది. ఏప్రిల్ 3 నుండి కుజుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అనేక ప్రయోజనాలు అందుతాయి. అంతే కాకుండా విద్యార్థులకు ఇది మంచి సమయం. వివాహితులకు పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. అంతే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు ఊహించని ధనలాభాలను పొందుతారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి కుజుడి సంచారం అద్భుత ఫలితాలను అందిస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారికి భూమి-ఆస్తి విషయాలలో విజయం లభిస్తుంది. అలాగే.. చట్టపరమైన విషయాలలో కూడా ఆహ్లాదకరమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీ పనికి తగిన ఫలితం లభిస్తుంది.
తులా రాశి:
తులారాశిలో కష్టపడి పనిచేసే వారికి.. కుజ సంచార కాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే.. మీరు మీ ధైర్యం, శౌర్యంతో ముందుకు సాగడంలో విజయం సాధిస్తారు. విజయ మార్గంలో అనేక అడ్డంకులు వస్తాయి. డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్ లను పొందుతారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు.
Also Read: పూజ చేస్తున్నారా ? పొరపాటున కూడా.. ఈ రంగు బట్టలు ధరించొద్దు !
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వలన సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ వ్యక్తులు తమ ఆఫీసుల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మతపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటం ద్వారా.. మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మీ ఆర్థిక విషయాల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.