Lady Aghori B Tech Student Sri Varshini| గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి (Lady Aghori) వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవలే సనాతన ధర్మం పేరుతో ఆలయాల వద్ద నానా హంగామా సృష్టించిన లేడీ అఘోరీ నాగ సాధు తాజాగా ఓ యువతితో లైంగిక సంబంధాలున్నాయన ఆరోపణలు వచ్చాయి.
లేడీ అఘోరి అసలు పేరు అల్లూరి శ్రీనివాస్. పురుషుడిగా జన్మించి లింగ మార్పిడి చేసుకుని అమ్మవారిగా దీక్ష తీసుకున్నానని చెబుతూ.. ఈమె వివిధ రూపాల్లో వార్తల్లో నిలుస్తూ మీడియా చర్చలకు కారణం అవుతోంది. తాజాగా బీటెక్ చదివిన శ్రీవర్షిణిని కూడా చేరదీసి, మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు ఆలయాలను సందర్శించే పేరుతో రచ్చ చేస్తూనే, ఇటీవల ఓ యువతిని మైండ్ వాష్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అసలు అఘోరి లక్ష్యం ఏమిటి అనే చర్చ ప్రారంభమైంది. ఈమె ఈ పనులు ఎందుకు చేస్తోంది అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ క్రమంలో, సీబీ-సీఐడీ కూడా ఆమెపై నిఘా పెట్టినట్లు సమాచారం.
మీడియాతో లేడీ అఘోరి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లేడీ అఘోరి, తనపై సీబీ సీఐడీ విచారణ జరుగుతోందని స్వయంగా ప్రకటించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా.. ఏం చేస్తూ ఉన్నా విచారణ అధికారులు.. తన గురించి తెలుసుకుంటూనే ఉన్నారని చెప్పింది. శ్రీ వర్షిణి అనే యువతిని దురుద్దేశ్యంతో లొంగదీసుకున్నానని తనపై వచ్చిన ఆరోపణలపై కూడా లేడీ అఘోరి స్పందించింది. సర్వం పరమేశ్వరుడే అని, శరీరంతో సహా శివయ్యకు త్యాగం చేసిన వ్యక్తి అయిన తనకు అలాంటి దురాలోచనలు ఎలా కలుగుతాయని ప్రశ్నించింది. తనకు మూత్రం పోసేందుకు మాత్రమే అవకాశంగా ఉందని.. తనకు కామ వాంఛలు అసలే లేవని తెలిపింది.
తనను నాగసాధువుగా ప్రకటించుకున్న లేడీ అఘోరి.. నిజమేనా?
లేడీ అఘోరి అల్లూరి శ్రీనివాస్ తనను తాను నాగ సాధువుగా ప్రకటించుకుంటోంది. అయితే సాధారణంగా నాగ సాధువులు ప్రజల్లో తిరగరాదు. వారు జనసంచారానికి దూరంగా పర్వత ప్రాంతాల్లో తపస్సు చేస్తుంటారు. కుంభమేళా సమయంలో మాత్రమే జనసమూహంలోకి వస్తారు, వారు ఎవరితోనూ మాట్లాడరు. పుణ్యస్నానాలు చేసి తిరిగి తమ ప్రదేశాలకు వెళ్ళిపోతారు. కానీ లేడీ అఘోరి వైఖరి గత కొంతకాలంగా చూస్తే.. ఇందుకు విరుద్ధంగా ఉంది. పేరుకు నాగసాధువుగా కనిపిస్తోంది. ఆమె వ్యవహారశైలి అఘోరీలాగా లేదని విమర్శలు వస్తున్నాయి.
Also Read: జనగామలో అర్ధరాత్రి క్షుద్రపూజలు.. యువతికి చేతబడి? అక్కడ ఏం దొరికాయంటే?
అఘోరిపై వివాదాలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఇటీవల సందర్శించిన లేడీ అఘోరి అక్కడ హంగామా సృష్టించింది. పోలీసులు ఆమెతో వాగ్వాదానికి దిగారు, తీవ్రమైన పదజాలంతో దూషించారు. అఘోరి సనాతన ధర్మం పరిరక్షణకు పాటుపడుతానని చెబుతోంది, అయితే సమాజంలో ఆమె వ్యవహారం పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె నిజంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుందా లేదా పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలా చేస్తుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె తన విధానాలతో వివాదాలు సృష్టించి వార్తల్లో నిలవాలనే ప్రయత్నిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
బీటెక్ యువతితో సంబంధం
బీటెక్ చదివిన శ్రీవర్షిణితో పరిచయం పెంచి, ఆమెను లేడీ అఘోరీ మాయమాటలు చెప్పి తన వైపు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగా అఘోరీ వద్దకు వెళ్లానని శ్రీవర్షిణి పోలీసులకు చెప్పింది. దీనిపై తల్లిదండ్రులు కన్నీటి పెట్టుకుంటున్నారు. అయితే, నిత్యం వివాదాలతో ఉండే అఘోరీ వద్దకు యువతిని చేరడం పై సమాజం నుంచి విమర్శలు వస్తున్నాయి. వర్షిణి అన్న కూడా తనతో లేడీ అఘోరీ సంబంధం పెట్టుకుందని తనకు ఆరోపించాడు. కానీ ఈ ఆరోపణలును లేడీ అఘోరీ కొట్టిపారేసింది. శ్రీ వర్షిణి తన వద్దకు దీక్ష తీసుకునేందుకు వచ్చిందని.. ఆమె వెళ్లాలనుకుంటే తాను ఆపేది లేదని చెప్పింది.