E-Paper
Advertisement

Honour Killing: పరువు హత్య వెనుక అసలేం జరిగింది? కూతురు ప్రేమ విహహం, షాకైన తండ్రి

Honour Killing: పరువు హత్య వెనుక అసలేం జరిగింది? కూతురు ప్రేమ విహహం, షాకైన తండ్రి
Advertisement

Honour Killing: ఈ మధ్యకాలంలో పరువు హత్యల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మీడియా దృష్టికి వచ్చిన కొన్ని మాత్రమే. రాకుండా ఆ తరహా ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఓ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది యువతి. అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన తండ్రి చేతులు, కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లో పరువు హత్య వెనుక

Advertisement

మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. థాపక్ గ్రామంలో కూతుర్ని కన్న తండ్రి హత్య చేశాడు. సంచలరం రేపింది ఈ పరువుహత్య. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహించిన తండ్రి, గన్‌తో కాల్చి చంపాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు లోతుల్లోకి వెళ్తే..

పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. భిండ్ జిల్లా ఖేరియా థపక్ గ్రామంలో మున్నేష్ ధనుక్ దంపతులు ఉండేవారు. వారికి నిధి ధనుక్ కూతురు ఉంది. యువతి వయస్సు 21 ఏళ్లు. నిధి.. వరసకు మామ అయిన దేవ్ అనే యువకుడితో లవ్‌లో పడింది. నిధి-దేవ్ ల మనసులు కలిశాయి. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో తన ఇంట్లో తెలిస్తే అంగీకరించరని యువతి చెప్పింది.

Advertisement

తోటలోకి తీసుకెళ్లి కూతుర్ని కాల్చి చంపిన తండ్రి

ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వివాహనం చేసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 11న ఇంటి నుండి పారిపోయింది నిధి. కోరుకున్న ప్రియుడ్ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత నూతన వధూవరులు నిధి-దేవ్ ఇద్దరు కలిసి గ్వాలియర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. ఇద్దరు మేజర్లు కావడంతో కలిసి జీవించడానికి అనుమతి ఇచ్చారు పోలీసులు.

ఈ విషయం తెలిసి పగతో రగిలిపోయాడు కన్న తండ్రి. తాను పుట్టి పెరిగిన గ్రామంలో కూతురు పరువు తీసిందని కుమిలిపోయాడు. అది కాస్త రివేంజ్‌గా మారింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న నిధి తన భర్త దేవ్ తో కలిసి గ్వాలియర్‌లోని మహారాజ్‌వాడ ప్రాంతంలో షాపింగ్‌కు వెళ్లింది. దాదాపు 5 వేల విలువ చేసే షాపింగ్ చేశారు. నిధి.. తన భర్తని నీళ్ళు అడిగింది. అతడు నీళ్ళ కోసం వెళ్లాడు.

ALSO READ: రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్.. సమాచారం గ్రూప్‌లోకి అశ్లీల వీడియోలు పంపి

ఈలోగా నిధి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ తర్వాత భర్త, అత్తమామలు కలిసి నిధి కోసం విస్తృతంగా గాలించారు. ఎలాంటి జాడ దొరకలేదు. షాపింగ్ నుంచి కూతుర్ని కిడ్నాప్ చేసిన తండ్రి మున్నేష్ ధనుక్, నేరుగా ఆవాల తోటకు తీసుకెళ్లి కాల్చి చంపాడు. తోటకు వెళ్లిన వ్యవసాయదారులు పొలంలో నిధి మృతదేహం కనిపించడంతో షాకయ్యారు.

వెంటనే నిధి తల్లి పూజ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, తండ్రి హంతకుడ్ని తేల్చారు. చివరకు మున్నేష్ ధనుక్‌ని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్షలకు తరలించారు. విచారణలో నిందితుడి తండ్రి మున్నేష్ ధనుక్ నేరం అంగీకరించాడు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×