E-Paper
Advertisement

Family Murder : కుటుంబం దారుణ హత్య.. ఆపై నిందితుడి ఆత్మహత్య.. కారణమేంటంటే?

Family Murder : కుటుంబం దారుణ హత్య.. ఆపై నిందితుడి ఆత్మహత్య.. కారణమేంటంటే?
Advertisement

Man kills Family and Shot Himself : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం వారిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో వెలుగుచూసింది. రాంపూర్ – మథుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్హాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనురాగ్ సింగ్ (45) మానసికంగా కుంగిపోయి.. మద్యానికి బానిసయ్యాడు. డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. అతనితో డ్రగ్స్ మానిపించేందుకు డ్రగ్స్ రహిత కేంద్రానికి తీసుకెళ్లే విషయమై గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అనురాగ్ విచక్షణ కోల్పోయాడు. తుపాకీతో తల్లి సావిత్రి (65), భార్య ప్రియాంక (40), కూతురు అశ్విని (12), మరో కూతురు అశ్విని (10), కుమారుడు అద్వైత (6) పై కాల్పులు జరిపి హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాల్పుల మోత, ఇంటి నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో.. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని చూసే సరికి కుటుంబమంతా మరణించి ఉన్నారు.

Advertisement

వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అనురాగ్ కుటుంబ సభ్యుల్ని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం.. ఆధారాలను సేకరించే పనిలో పడింది. కుటుంబం హత్య, వ్యక్తి ఆత్మహత్యతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×