BigTV English

CM Revanth counter on Jagan comments: జగన్‌కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి..

CM Revanth counter on Jagan comments: జగన్‌కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి..

CM Revanth counter on Jagan comments(Political news telugu): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తెలంగాణకు పాకింది. విపక్షాల టీడీపీ, బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చుకోలేక గింజుకుంటున్నారు అధికార వైసీపీ నేతలు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం మొదలుపెట్టారు.


ఏమైనా అంటే చంద్రబాబుకు పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో సాగుతున్నారని ఆరోపణలు గుప్పించడం తప్పితే సమస్యకు ఫుల్‌‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడంలేదు. చీటికి మాటికీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికు ఆయా అంశాలను ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం కడప రోడ్ షోలో సీఎం జగన్ చేసిన కామెంట్స్‌కి కౌంటరిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన మాటలను సొంత చెల్లెళ్లు, తల్లి నమ్మడం లేదన్నారు. వాళ్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచన చేశారు. కుటుంబ సమస్యలు రాజకీయ వేదికపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి దానిపై దృష్టి పెడితే బాగుంటుందని చురక అంటించారు.


రేవంత్‌రెడ్డి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అని గుర్తు చేశారాయన. వ్యక్తులతో పరిచయాలకు రాజకీయాలతో సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబునాయుడు అంటే గౌరవం ఉందని, ఆయనతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని మనసులోని మాట బయటపెట్టారు. ఏపీలో షర్మిల నాయకత్వం బలోపేతం చేయడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కుటుంబ సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఫ్యామిలీ విషయంలో ఏపీ సీఎం జగన్‌ ఒత్తిడికి లోనవుతున్నారని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అందరూ తనను దోషిగా చూపించడం ఆయనకు మింగుడుపడడం లేదన్నది నిపుణుల వాదన. అందువల్లే తన ఫ్యామిలీ మేటర్‌ని ఇతరులపైకి నెట్టేసి రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు. వివేక కేసులో సీబీఐ దర్యాప్తుకు సహకరిస్తే మ్యాటర్ ఇంతవరకు వచ్చేదికాదని అంటున్నారు. అయినా ఇంటి సమస్యను చక్కదిద్దలేనివారు, ఇక ప్రజల సమస్యలకు ఎలా ఫుల్‌స్టాప్ పెడతారని అంటున్నారు. కొందరైతే సర్వేలు పార్టీకి అనుకూలంగా రాలేదన్న కారణమే ఈ విధంగా జగన్ బాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

 

 

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×