Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నగ్నపూజల కలకలం రేగింది. ఓ బాలికను నగ్నపూజలకు సిద్ధం చేయడంతో హాస్టల్ నుండి పారిపోయింది. పట్టణంలోని బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. హాస్టల్ లో బాలిక తన సోదరితో కలసి ఉంటోంది. కాగా ఆమె పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వంటమనిషి మచ్చిక చేసుకుంది. బాలికను చేరదీస్తున్నట్టుగా నటిస్తూ మాయమాటలు చెప్పింది. బాలిక దగ్గరవ్వడంతో నగ్నపూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించింది. ఆ డబ్బుతో సంతోషంగా ఉండవచ్చని ఒప్పించింది.
Also read: కాసేపట్లో పెళ్లి.. వరుడు పరుగో పరుగు.. కట్ చేస్తే సినిమా రేంజ్ సీన్లే
ఈ క్రమంలో పూజలు చేసేందుకు ఓ వ్యక్తిని వంటమనిషి పర్సనల్ రూముకు తీసుకువచ్చి నగ్నంగా ఉంటే పూజలు చేస్తారని చెప్పింది. భయాందోళనకు గురైన బాలిక వెంటనే హాస్టల్ నుండి పారిపోయింది. మంథనిలోనే తన బంధవుల ఇంట్లో తలదాచుకుంటూ జరిగిన విషయాన్ని వారికి వివరించింది. బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు హాస్టల్ కు వెళ్లి వంటమనిషిని నిలదీశారు. అంతే కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాయ మాటలు చెప్పి ప్రలోభపెట్టిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లి దండ్రుల ఫిర్యాదుతో మహిళపై ఫోక్సో కింద కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే హాస్టల్ లో నగ్నపూజలు అంటూ బాలికను బయపెట్టడం సంచలనంగా మారింది. అసలే హాస్టల్ అంటే బాలికలు బయపడిపోతారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను హాస్టలో చేర్పించాలంటే ఆలోచిస్తారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చాలా మంది పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బాలికలు కూడా హాస్టల్ లో కానీ స్కూల్స్, కాలేజీలలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అనుమానం వచ్చినా తల్లిదండ్రలకు ఫిర్యాదు చేయాలి.