BB Telugu 8 Promo: బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss)కూడా ఒకటి. ఇప్పటికే హిందీలో 18వ సీజన్ నడుస్తూ ఉండగా.. అటు కన్నడలో 11వ సీజన్ నడుస్తోంది. ఇక తెలుగులో 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాలు గడిస్తే తెలుగులో 8వ సీజన్ కూడా పూర్తి అవుతుంది. ఇక ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్, 13 వ వారం కూడా మొదలైంది. అందులో భాగంగానే నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తవగా.. పోలింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏకంగా 33% ఓటింగ్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచారు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ(Gautham Krishna) . ఇక టైటిల్ విన్నర్ అనుకుంటున్న నిఖిల్ (Nikhil)మాత్రం కేవలం 11 శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో ప్రేరణ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోహిణి(Rohini) మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు. ఇక తాజాగా పోల్ అయిన ఓట్లను బట్టి చూస్తే.. ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్ లో పేరు తెచ్చుకున్న పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్ లో ఉన్నారు. పూర్తి ఓటింగ్ ముగిసే వరకు డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరో చెప్పడం కష్టమని చెప్పాలి.. ఇదిలా ఉండగా తాజాగా 86వ రోజుకు సంబంధించి ప్రోమో ని విడుదల చేశారు బిగ్ బాస్. ఇందులో గెస్ట్ లు వచ్చి కంటెస్టెంట్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ అయిన అఖిల్ (Akhil)తో పాటు దేత్తడి హారిక(Detthadi Harika)అడుగుపెట్టింది.
అడుగుపెట్టగానే అఖిల్.. రోహిణి తో శివంగిలా ఆడుతున్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత టేస్టీ తేజాతో అసలు ఫ్యాంట్ వేసుకున్నావా? అంటూ కామెంట్ చేశారు. ఇక పృథ్వీ తో ఏంటి బ్రో..నీ ఫోటో నా ఫోటో వేసి తెగ ట్రోల్స్ చేస్తున్నారు అంటూ కామెడీ పండించారు అఖిల్. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. టికెట్ టు ఫినాలే పొంది మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీ కోసం మీరు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయాల్సి ఉంటుంది అంటూ తెలిపారు బిగ్ బాస్. టేబుల్ మీద ఉన్న బాక్స్ లతో ఆరో మార్క్ వేయాలి అని తెలుపగా రోహిణి, గౌతమ్ , టేస్టీ తేజ, విష్ణుప్రియ నలుగురూ కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ రోహిణి మొదటిసారి ఓడిపోయినా.. రెండవసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి గంట మోగించింది. మొత్తానికి అయితే తన ఆట తీరుతో మైండ్ స్ట్రాటజీతో చక్కగా గేమ్ ఆడి అందరిని మెప్పించింది రోహిణి. ఇక తర్వాత టేస్టీ తేజ, అవినాష్ తో మాట్లాడుతూ.. ఎన్నిసార్లు ట్రై చేసిన మొదట్లోనే ఓడిపోతున్నానన్న అంటూ బాధపడ్డారు. దేనికైనా సపోర్టు కావాలన్నా అంటూ తెలిపారు టేస్టీ తేజ.