Viral Video: శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే.. ఈ పాడు పని ఏందిరా మా అయ్య.. ఇంతకు తెగిస్తావా.. ఏదో ప్రేమగా మెడలో వేసుకున్నదాన్ని ఇలా తీసుకెళ్తావా.. ఉండు నీ సంగతి చెబుతా అంటూ ఆ పెళ్లికొడుకు చేసిన పనికి అందరూ షాక్. ఏదైతేనేమి చివరికి సాధించాడు. ఆ పెళ్లిలో జరిగిన విషయం తెలుసుకున్న అందరూ ఖంగుతిన్నారు. పెళ్ళికొడుకు ను మాత్రం శభాష్ అన్నారు. ఈ ఘటన మీరట్ లో జరిగింది.
సాధారణంగా మీరట్ లో పెళ్లి అంటే చాలు.. గుర్రంపై పెళ్లి కొడుకు సవారీ ఉండాల్సిందే. అలా ఓ పెళ్లి కొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు ప్రేమగా పెళ్ళికొడుకు మెడలో నోట్ల దండను వేశారు. ఆ దండను చూసుకుని మునిసిపోయాడు వరుడు. ఇక అంతే మరి కొద్ది క్షణాల్లోనే ఆ నోట్ల దండ మాయమైంది.
ఓవైపు పెళ్ళికొడుకు ఊరేగింపు సాగుతూ ఉండగా.. అదే మార్గంలో టాటా ఏస్ లో ఎక్కి వచ్చిన ఓ దొంగ, పెళ్ళికొడుకు మెడలోని నోట్ల దండను లాక్కొని అదే వాహనం ద్వారా పరారయ్యాడు. ఇక అంతే పెళ్లి కొడుకు షాక్.. అతని వెంట ఉన్నవారు కూడా షాక్. అయితే పెళ్లికొడుకు మాత్రం సినిమా రేంజ్ లో గుర్రం దిగాడు. బైక్ ఎక్కాడు.. చేజింగ్ చేయడం మొదలుపెట్టాడు. చిట్ట చివరకు టాటా ఏస్ వాహనానికి అడ్డుగా వెళ్లి దొంగను పట్టుకుని, నోట్ల దండను లాక్కున్నాడు.
అంతేకాదు ఆ దొంగను పట్టుకుని చితక్కొట్టాడు కూడ. ఈ తతంగమంతా పెళ్లికి వచ్చిన వారు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అంటూ పెళ్లి సాగుతుంటే.. ఓ దొంగ చేసిన నిర్వాకంతో, పెళ్ళికొడుకు హీరోయిజం బయటపడిందని వధువు బంధువులు చర్చించుకుంటూ చిరునవ్వులు విరబూశారట. అసలే పెళ్లికొడుకాయే.. ఆమాత్రం హుషారు ఉంటుందిగా.. అంటూ మరికొందరు ఈ ఘటన గురించి చర్చించుకున్నారు.