Markapuram: మార్కాపురం జిల్లాలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తండ్రి శవాన్ని పూడ్చిపెట్టారు. తర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో స్థానిక వైసీపీ నేత కిరణ్.. తన తండ్రి మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న స్కూల్ గ్రౌండ్ లో శనివారం సాయంత్రం పూడ్చేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు, స్కూల్ హెడ్ మాస్టర్.. కిరణ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
స్కూల్ పిల్లలు భయపడతారని చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు. ఆ స్థలం తనదే అంటూ తండ్రి శవాన్ని అక్కడే పూడ్చి పెడతానంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. చివరకు పాఠశాల ఆట స్థలంలోనే తండ్రి మృతదేహాన్ని పూడ్చేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు, హెడ్ మాస్టర్ గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు కిరణ్ ను అడ్డుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ కిశోర్ కుమార్ స్పందించారు. శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని సూచించామన్నారు.
స్కూల్ ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మృతదేహాన్ని మరో చోట పూడ్చిపెట్టాలని స్థానికులు కోరుకున్నారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు సరికాదంటున్నారు.
Also Read: హెల్మెట్ పెట్టుకున్నాడు.. కానీ, చావు తప్పలేదు, కారణం ఈ తప్పే!