BigTV English

Murders : ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?

Murders : ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?

Murders in East Godavari District : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరుస హత్యలు జరిగాయి. పురుషోత్తపట్నంలో ఒక మహిళ, పెద శంకర్లపూడిలో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో వివాహిత హత్యకు గురైంది. జాన్ – దివ్యభారతి భార్యభర్తలు. ఇటీవల జాన్ తల్లికి అనారోగ్యంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జాన్ కు భార్యపై అనుమానం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన భార్యపై జాన్ కత్తితో దాడి చేశాడు.


ఆమెను అతి కిరాతకంగా పొడిచి హతమార్చాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు జాన్ పై కేసు నమోదు చేసి.. అతనికోసం గాలిస్తున్నారు. జాన్ – దివ్యభారతిలకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

Also Read: పారిపోయిన ప్రేమజంట.. యువకుడి సోదరిపై యువతి బంధువులు సామూహిక అత్యాచారం!


ప్రత్తిపాడు నియోజకవర్గంలో మరో హత్య జరిగింది. ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో మాసా ఆదినారాయణ(45) అనే వ్యక్తిని దుండగులు కొట్టిచంపారు. పెదశంకర్లపూడికి చెందిన ఆదినారాయణ కొన్నాళ్లుగా అదే గ్రామానికి చెందిన మరో కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సోమవారం అర్థరాత్రి సమయంలో.. ఆమె ఇంటి ఆవరణలో ఆదినారాయణ మృతదేహం పడి ఉంది. దీంతో మృతుడి భార్య.. ప్రియురాలే (సిత్తరపు పాములమ్మ) తన భర్తను చంపేసిందని ఆరోపించింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సీఐ శేఖర్ బాబు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×