BigTV English

GOAT Movie: ‘గోట్’ సినిమాకు డైరెక్టర్ లేడా? సుడిగాలి సుధీర్ డైరెక్షన్ చేస్తున్నాడా?

GOAT Movie: ‘గోట్’ సినిమాకు డైరెక్టర్ లేడా? సుడిగాలి సుధీర్ డైరెక్షన్ చేస్తున్నాడా?

GOAT Movie Update(Greatest of All Time): జబర్ధస్త్ సుడిగాలి సుధీర్, యూట్యూబ్ ఫేమ్ దివ్యభారతి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోట్’. ఈ మూవీకి గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు మొదటి నుంచి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ పరిశ్రమలో వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరూ లేరని, సుడిగాలి సుధీర్ డైరెక్షన్ చేస్తున్నట్లు సమాచారం.


గోట్ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల నిర్మిస్తుండగా..ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ రూ.12 కోట్లు దాటిందని తెలుస్తోంది. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. బడ్జెట్ విషయంలో సమస్య తలెత్తడంతో మొదట్లో డైరెక్షన్ చేసిన నరేష్‌ తప్పుకున్నాడని, తర్వాత సుడిగాలి సుధీర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీపై భారీ అంచనాలు నెల కొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ విడుదలైంది. అయ్యే పాపం.. అనే సాంగ్ అభిమానులకు ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత గోట్ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ కు వివాదం రావడంతో షూటింగ్ నిలిచి పోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ సినిమా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ప్రకటించారు. ఈ సాంగ్ ఆగస్టు 17న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.


Also Read:  పీకల్లోతు కష్టాల్లో ఛార్మి.. డబుల్ ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు షాక్ తప్పదా ?

ఈ పోస్టర్‌లో డైరెక్టర్ పేరు ప్రకటించకపోవడంతో గతంలో వచ్చిన వార్తలు నిజమేనని సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.12 కోట్లు దాటడంతో షూటింగ్ ఆలస్యం అయిందని, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లను చూస్తే ఓ పల్లెటూరులో ప్రేమ కథలా అనిపిస్తోంది. మర ఈ సినిమాతో సుధీర్ ఎలా విజయం అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×