BigTV English

Thangalaan – Kanguva: విడుదలకు ముందే చిక్కుల్లో కంగువ, తంగలాన్ సినిమాలు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..

Thangalaan – Kanguva: విడుదలకు ముందే చిక్కుల్లో కంగువ, తంగలాన్ సినిమాలు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..

Vikram’s Thangalaan Movie And Suriya Kanguva land in legal Trouble: విక్రమ్ నటించిన తంగలాన్, సూర్య నటించిన కంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. విక్రమ్ నటిస్తోన్న తంగళాన్ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కానుంది. అలాగే సూర్య నటిస్తోన్న కంగువా మూవీ కూడా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు రిలీజ్‌కి ముందు షాకింగ్ న్యూస్ తగిలింది. మూవీస్ రిలీజ్ కావాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


కంగువ, తంగలాన్ చిత్రాల నిర్మాత కె.ఇ జ్ఞానవేలు ఓ వ్యాపారవేత్తకు రూ.కోట్లు బకాయి పడినట్లు ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు ఈ కేసును విచారిస్తుంది. 2011లో అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే నిర్మాత మూవీ ప్రొడక్షన్ కోసం జ్ఞానవేలు గ్రీన్ స్టూడియోకి 12.85 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అర్జున్ లాల్ సుందర్ దాస్‌కి కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే ఇచ్చి రూ.10.35 కోట్లు అప్పు చెల్లించకుండా వెళ్లిపోయారు. అనంతరం అర్జున్ లాల్ సుందర్ దాస్ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు గ్రీన్ స్టూడియోస్‌పై కేసు పెట్టారు.

ఈ నేపథ్యంలో కె.ఇ జ్ఞానవేలు మాట్లాడుతూ.. అర్జున్ లాల్ సుందర్ దాస్ ఇంతకు ముందు అతను నిర్మించిన 3 తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బులకు బదులగా రూ.12.85 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తెలియజేశాడు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు. కేవలం ఒక జిరాక్సు మాత్రమే ఉందని కోర్టుకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు. 2015లో వచ్చిన వరదలు కారణంగా అసలు ఆధారాలు అన్ని ధ్వంసం అయ్యాయని పేర్కొన్నాడు.


Also Read: ‘గోట్’ సినిమాకు డైరెక్టర్ లేడా? సుడిగాలి సుధీర్ డైరెక్షన్ చేస్తున్నాడా?

అయితే నిజానికి గ్రీన్ స్టూడియో రెండవ అంతస్థులో ఉంది. వరదలకు ఫైళ్లు ఏవీ నాశనమవ్వలేదని తర్వాత కోర్టు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అర్జున్ లాల్ సుందర్ కుటుంబ సభ్యులు రూ.10.25 కోట్లను 18 శాతం వడ్డీ కలిపి తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన మద్రాసు కోర్టు గ్రీన్ స్టూడియోస్‌కి ఏదైనా సినిమా రిలీజ్ చేసే ముందు ఒక్కొక్కరికి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×