BigTV English
Advertisement

Punjab Crime: పారిపోయిన ప్రేమజంట.. యువకుడి సోదరిపై యువతి బంధువులు సామూహిక అత్యాచారం!

Punjab Crime: పారిపోయిన ప్రేమజంట.. యువకుడి సోదరిపై యువతి బంధువులు సామూహిక అత్యాచారం!

Punjab Crime| ఓ మహిళ తన ఇంట్లో రాత్రి తన పిల్లలతో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు ఆమె ఇంట్లోకి చొరబడి పగ తీర్చుకోవడానికి మహిళపై అత్యాచారం చేశారు. అత్యాచారం తరువాత ఆ మహిళ తేరుకొని ఫిర్యాదు చేసినా పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేయలేదు. దీంతో ఆ మహిళ నెలలు తరబడి న్యాయపోరాటం చేశాక.. చివరికి ఇటీవలే ఆమెపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పైశాచిక ఘటన పంజాబ్ లోని లుధియానాలో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన కమలా రాణి (28, పేరు మార్చబడినది) అనే మహిళ తన భర్తతో పంజాబ్ లోని లుధియానాలో నివసిస్తోంది. కమలా రాణి భర్త లుధియానాల ఉద్యోగం చేస్తుండడంతో అక్కడే స్థిరపడ్డారు. మరోవైపు గోరఖ్ పూర్ కు చెందిన వరిందర్ అనే వ్యక్తి కుమార్తె వ్రింద (19).. సూరజ్ (21)ను ప్రేమించింది. సూరజ్ మరెవరో కాదు కమలా రాణి తమ్ముడు. సూరజ్ కుటుంబం కూడా గోరఖ్ పూర్ లోనే నివసిస్తోంది. కానీ సూరజ్ వేరే కులం కావడంతో వరిందర్ వారి వివాహానికి ఒప్పుకోలేదు. పైగా వరిందర్ తమ్ముడు రవిందర్ గోరఖ్ పూర్ లో ఓ రౌడీ. దీంతో సూరజ్ ని చంపేస్తామని బెదిరించారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్


ఏప్రిల్ 2024లో ప్రేమజంట అయిన సూరజ్, వ్రింద ఊరి వదిలి పారిపోయారు. వారి కోసం ఎంతవెతికినా వారి ఆచూకీ తెలియలేదు. ప్రేమికులిద్దరినీ చంపేందుకు రవిందర్ తన ముఠాతో గాలిస్తున్నాడు. ఈ విషయం తెలిసి సూరజ్ తల్లిదండ్రులు కూడా ఊరు వదిలి ఎక్కడికో పారిపోయారు.

తక్కువ కులం యువకుడు తమ ఇంటి ఆడపిల్లని తీసుకుపోయాడని.. తమ పరువుపోయిందని వరిందర్, రవిందర్ సోదరులు పగతో రగిలిపోయారు. మే నెలలో వారికి సూరజ్ సోదరి కమలా రాణి పంజాబ్ లో నివసిస్తోందని తెలిసింది. దీంతో వరిందర్, రవిందర్, వరిందర్ కుమారుడు అమన్ సింగ్, వారి బంధువు సంతోష్ సింగ్ నలుగురు కలిసి పంజాబ్ లోని లుధియానా నగరానికి వెళ్లారు. అక్కడ కమలా రాణి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కమలా రాణి భర్త ఉద్యోగ రీత్యా నైట్ షిఫ్ట్ కు వెళ్లాడు. దీంతో కమలా రాణి తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఒంటరిగా ఉంది.

Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

గోరఖ్ పూర్ నుంచి వచ్చిన వరిందర్ గ్యాంగ్.. కమలా రాణి ఇంట్లో బలవంతంగా ప్రవేశించి.. వ్రింద, సూరజ్ గురించి చెప్పమని అడిగారు. తనకు ఈ విషయం తెలీదని కమలా రాణి చెప్పడంతో ఆమెను మహిళ అని చూడకుండా చితకబాదారు. చివరికి కోపంతో వరిందర్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత మిగతా ముగ్గురు కూడా రాక్షసంగా కమలారాణిపై అత్యాచారం చేశారు.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

వారందరూ వెళ్లిపోయిన తరువాత కమలా రాణి తేరుకొని తన భర్తకు ఫోన్ చేసింది. ఆమె భర్త వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఆమె ఫిర్యాదు వెంటనే నమోదు చేయలేదు. దీంతో ఆమె రెండు నెలలపాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తనకు న్యాయం చేయమని తిరిగింది. చివరికి ఆగస్టులో ఆమెపై అత్యాచారం చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Tags

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×