E-Paper
Advertisement

Hundi Robbery: వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. బంగారం, వెండి..

Hundi Robbery: వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. బంగారం, వెండి..
Advertisement

Hundi Robbery: శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందడంతో, అప్పటి నుంచి ఈ ఆలయాన్ని మూసివేసి ఉంచారు. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పనులు జరుగుతుండగా, నిన్న రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీభత్సం సృష్టించారు. స్వామివారి విగ్రహాలకు అలంకరించిన బంగారు, వెండి నామాలు, ఆభరణాలతో పాటు రెండు భారీ హుండీలను కొల్లగొట్టారు.

ఈ చోరీ అత్యంత పక్కా ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది. దొంగలు ముందుగానే ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం గర్భాలయంలోని విగ్రహాల నగలను దోచుకోవడమే కాకుండా, హుండీల్లో ఉన్న నగదును కూడా ఊడ్చేశారు. అయితే, విచిత్రంగా హుండీల్లోని నోట్లు, విలువైన ఆభరణాలన్నింటినీ తీసుకున్న దొంగలు, కేవలం చిల్లర నాణేలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లడం గమనార్హం.

Advertisement

ఆలయ వ్యవస్థాపకులు హరి ముకుంద్ పాండా, ఆలయ పూజారి వెల్లడించిన వివరాల ప్రకారం.. చోరీకి గురైన ఆభరణాలు, నగదు విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత ఆలయం మూసి ఉన్నప్పటికీ, హుండీలలో పెద్ద మొత్తంలో కానుకలు ఉండటం, విలువైన నగలు ఉండటాన్ని దొంగలు ముందే పసిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Also Read: ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఆలయం మూసి ఉన్న సమయంలో సెక్యూరిటీ వైఫల్యంపై కూడా ఆరా తీస్తున్నారు. స్థానిక నిఘా నేత్రాలను పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గతంలో జరిగిన విషాద ఘటన నుంచి కోలుకోకముందే, ఇప్పుడు భక్తి భావంతో కూడిన ఆలయంలో ఇలాంటి అపచారం జరగడం పట్ల స్థానిక భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×