ఈ ఘటన సిటీ పరిధిలోని మేడ్చల్ లో జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన అక్కడి వాతావరణం.. ఈ హత్యతో ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్ (25) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. క్షణాల్లోనే అక్కడి నుంచి రోడ్డు దాటుకుని నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దాంతో.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హత్య తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాగా.. ఘటనలో చనిపోయిన ఉమేష్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా యువకుడి మృతదేహం దగ్గర కూర్చోని, కన్నీళ్లు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్నవారందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
Also Read : చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం.. ఫ్యామిలీ సూసైడ్, ఏం జరిగింది?
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఏవైనా పాత కక్షలతో ఈ హత్యలు జరిగాయా లేదంటే మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.