Jagtial Crime News: పచ్చని కాపురంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. దాని ఫలితంగా అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులు బలైపోతున్నారు. ఊహ తెలిసే సరికి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు అలాంటి ఘటన ఒకటి జగిత్యాలలో చోటు చేసుకుంది. భర్త చేసిన పనులకు ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మద్దులపల్లిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జగిత్యాలకు చెందిన 30 ఏళ్ల హారికకు తిరుపతితో పుష్కర కాలం కిందట పెళ్లి అయ్యింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. బాబుకు తొమ్మిదేళ్లు కాగా, కూతురు ఏడేళ్లు. హాయిగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. హారిక భర్త ఒగ్గు కథలు చెబుతాడు. ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గ్రామాలు తిరుగుతూ ఒగ్గు కథలు చెబుతాడు.
హారిక పొలం పనులు చేసేది. ఈ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. గురువారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పురుగుల మందు ఇచ్చింది కన్నతల్లి. వారి విషం తాగిన తర్వాత ఆ తల్లి తీసుకుంది. విషం తీసుకున్న విషయాన్ని భర్త తిరుపతికి ఫోన్ చేసి చెప్పింది. భర్త వచ్చేసరికి ముగ్గురు సభ్యులు స్పృహ తప్పి కోల్పోయారు. హుటాహుటీన ముగ్గుర్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం హారిక మృతి చెందింది. పిల్లలు హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆదివారం ఉదయం మృతి చెందారు. అయితే మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ALSO READ: సంగారెడ్డిలో దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం
మరోవైపు దంపతుల కాల్ డేటా పరిశీలిస్తే సూసైడ్ వెనుక కారణాలు వెల్లడయ్యే అవకాశముందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇదిలాఉండగా మీడియాతో మాట్లాడిన మృతిరాలి సోదరి, అక్రమ సంబంధం కోసం భార్యను హింసించాడని వాపోయింది. తాను మరొక పెళ్లి చేసుకుంటానని, అందుకు అంగీకరించాలని టార్చర్ చేసినట్టు తెలిపింది.
హారిక అంగీకరించలేదని, చివరకు పురుగుల మందు ఇచ్చి చంపేశాడని వాపోయింది. ఎవరితో అయితే రిలేషన్ షిప్ ఉందో ఆమెని ఇంటికి తీసుకొచ్చాడని తెలిపింది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న వివాహేతర సంబంధం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులప్లలి గ్రామానికి చెందిన కంబాల హారిక, తన ఇద్దరి పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హారిక మృతి
ఈరోజు ఇద్దరు పిల్లలు… pic.twitter.com/OVxlUigLpy
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025