BigTV English

Jammu Kashmir : ప్రభుత్వ జీతాలతో ఉగ్రవాదులకు సేవలు – ఇన్నాళ్టికి వేటు

Jammu Kashmir : ప్రభుత్వ జీతాలతో ఉగ్రవాదులకు సేవలు – ఇన్నాళ్టికి వేటు

Jammu Kashmir : జమ్మూకశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే కారణంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు, ఓ కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగిస్తూ జమ్మూ కశ్మీరి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రెండోసారి జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులు ఇవి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ.. ఇస్లామిక్ ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ, వారికి సమాచారం చేరవేస్తున్న 69 మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేశారు.


ఉగ్ర సంబంధాలతో ఉద్యోగుల కోల్పోయిన వారిలో కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహ్మద్ అష్రఫ్ భట్, జమ్మూకశ్మీర్ అటవీ శాఖలో ఆర్డర్లీ నిసార్ అహ్మద్ ఖాన్‌గా వెల్లడించారు. గతేడాది నవంబర్ 30న, దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఎల్జీ సిన్హా.. ఇద్దరు ప్రభుత్వ అధికారులను సేవల నుంచి తొలగించారు. దీంతో.. ప్రతిపక్షాలు, ఇస్లామిక్ మిలిటెంట్ల మద్ధతుదారులు ఎల్జీపై విమర్శలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం మోహబూబా ముఫ్తీ ఎల్జీ, ఓమర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఉగ్రవాదాల కోసం పనిచేసిన పోలీసు


కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్ 2005లో SPO గా విధుల్లో చేరాగా.. 2011లో కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది. పోలీసు వ్యవస్థలో ఉంటూ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, పోలీసులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడనే కారణంగా.. 2024 మేలో అరెస్టు చేశారు. ప్రస్తుతం కోట్ బల్వాల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఇతను కానిస్టేబుల్‌గా ఎంపికైన తర్వాత.. J&K పోలీసులలో ఎలక్ట్రానిక్ నిఘా యూనిట్ కు సంబంధించిన రహస్య సమాచారం ఉండే పోస్టులో నియమించారు. దాంతో.. అతను ఇస్లామిక్ టెర్రరిస్టుల కోసం పని చేయడం ప్రారంభించి.. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. చాన్నాళ్లు రహస్యంగా ఉన్న ఇతను.. 2024లో అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు వసీం షా, అద్నాన్ బేగ్‌లను భద్రతా దళాలు అరెస్టు చేసి, విచారించగా.. ఇతని వ్యవహారం బయటపడింది. అనంత్‌నాగ్‌ను సందర్శించే స్థానికేతరులు, ముస్లింలు కాని వారిపై ఉగ్రవాద దాడులు చేసేందుకు సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతని ఇంటి నుంచి పిస్టల్స్, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు. మాదకద్రవ్యాలతో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

సహచరు పోలీసుల మరణానికి సహాయం

2020లో దారుణ హత్యకు గురైన పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ అష్రఫ్ భట్ హత్యకు ఎల్ఈటీ ఉగ్రవాదులకు భట్ సహాయం చేశాడు. మే 18, 2024న టార్గెట్స్ ఇచ్చి ముస్లిమేతర్లు, పర్యాటకులపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులకు సహకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద గ్రూపుల్లో చేరడానికి యువకులను ఆకర్షించడం, తీవ్రవాదాన్ని ప్రేరేపించడంలో భట్ కీలకంగా పని చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. తన కానిస్టేబుల్ ఐడీని వినియోగించుకుని.. ఉగ్రవాదుల కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

దేశద్రోహిగా ఫారెస్ట్ ఆర్డర్లీ

ప్రస్తుతం అనంత్‌నాగ్‌లోని వెరినాగ్‌లోని అటవీ రేంజ్ కార్యాలయంలో ఆర్డర్లీగా పని చేస్తున్న నిసార్ అహ్మద్ ఖాన్.. 1996లో అటవీ శాఖలో సహాయకుడిగా చేరాడు. ఇతను.. దేశాన్ని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఎన్నో కుట్రలు పన్నినట్లు గుర్తించారు. ఇతన్ని.. ప్రభుత్వ ఉద్యోగంలోకి హిజ్బుల్ ముజాహిదీన్ పంపినట్లుగా నిఘా వర్గాలు తర్వాత విచారణలో కనుక్కున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే.. అతను రహస్యంగా హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరి, వేర్పాటువాదులకు సహకరించాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగి.. గతంలో ఓ మాజీ మంత్రి హత్య వెనుక కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. 2000 ఏడాదిలో అనంతనాగ్ జిల్లాలోని చమరన్ వద్ద జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడుతో హిజ్బుల్ ముజాహిదీన్‌తో అతని సంబంధాల గురించి మొదటిగా తెలిసింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ఈ దాడికి పాల్పడగా… అప్పటి జమ్మూకశ్మీర్ విద్యుత్ మంత్రి గులాం హసన్ భట్ మరణించాడు. నాసిర్ ఖాన్, మరొక నిందితుడు.. ఇద్దరు పోలీసు సిబ్బందితో కలిసి అప్పటి మంత్రిని హత్య చేసేందుకు ఉగ్రవాదులకు మందుగుండు సామాగ్రిని అందించారు.

ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జీతాలు తీసుకుంటూ.. ఇస్లాం ఉగ్రసంస్థల కోసం పని చేస్తున్న వారిని నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో మహ్మద్ అష్రఫ్ భట్ ఒకరు. ఇతను 2008లో రెహబార్-ఎ-తలీమ్ టీచర్‌గా నియమితులయ్యారు. తాత్కాలిక ఉద్యోగం అయిన రెహబార్-ఎ-తలీమ్ టీచర్ వ్యవస్థను 2000లో ప్రవేశపెట్టారు. ఆయనను రెగ్యులరైజ్ చేసి జూన్ 2013లో శాశ్వత ఉపాధ్యాయుడిగా నియమించారు. అష్రఫ్ టీచర్ గా చేస్తూనే.. లష్కరే తోయిబాకు అనుకూలంగా పనిచేశాడని, వారికి క్షేత్రస్థాయి కార్యకర్తగా పని చేశాడని గుర్తించారు. ఇతని కార్యకలపాల్ని గుర్తించిన నిఘా వర్గాలు.. 2022లో అరెస్టు చేశారు. ప్రస్తుతం రియాసి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అష్రఫ్ భట్ హ్యాండ్లర్ పాకిస్తాన్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఎల్‌ఇటి ఉగ్రవాది మొహమ్మద్ ఖాసిం అని తేలింది. ఇతను.. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేందుకు పని చేసినట్లు తెలిపారు.

Also Read :  ఏఐ కోసం సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు.. మోటా భారీ ప్రాజెక్టులోకి ఇండియా

ఉగ్రవాదులతో సంబంధాలపై స్పష్టమైన సమాచారం అందుకున్న తర్వాత కూడా అక్కడి ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. ఎల్జీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ, జమ్ముకశ్మీర్ ఉద్యోగులను తొలగించడం సరైంది కాదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులను కోర్టులో హాజరుపరిచి, వాళ్ల వాదన కూడా వింటే బాగుండేది అంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇక.. జమ్ముకశ్మీర్ లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. నేరుగా ఎల్జీ నిర్ణయం తీసుకోవడం ఏటంటూ.. మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×