Daali Dhananjaya: గత కొన్నాళ్లుగా ఎంతోమంది ఇతర భాషా నటీనటులు.. తెలుగులో కూడా అడుగుపెట్టి వారి నటనతో ఇక్కడి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. అందులో కొందరు కన్నడ హీరోలు కూడా ఉన్నారు. కన్నడలో హీరోలు అయినా కూడా తెలుగులో విలన్‌గా నటించిన వారు ఉన్నారు. అందులో దాలి ధనంజయ కూడా ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో జాలి రెడ్డి పాత్రతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు ధనంజయ. కొన్నిరోజుల క్రితమే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగబోతుందని అనౌన్స్ చేశాడు ఈ హీరో కమ్ విలన్. తాజాగా మైసూరులో తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటికొచ్చాయి.
అతిథులుగా సెలబ్రిటీలు
‘పుష్ఫ’లో మాత్రమే కాదు.. ‘పుష్ప 2’లో కూడా జాలి రెడ్డి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దాలి ధనంజయ. తాజాగా మైసూరులో డాక్టర్ ధన్యత గౌనక్లర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికొచ్చాయి. అటు కన్నడ మాత్రమే కాదు.. ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ధనంజయ పెళ్లికి శుభాకాంక్షలు చెప్తున్నారు. గతేడాది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ధన్యంతతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు ధనంజయ. తాజాగా మైసూరులో ఘనంగా పెళ్లి జరగగా.. ఈ పెళ్లికి తనకు క్లోజ్ అయిన సినీ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించాడు. శివ రాజ్‌కుమార్, కిచ్చ సుదీప్, చిరంజీవి, అల్లు అర్జున్, రష్మిక మందనా తదితరులు ఈ పెళ్లికి హాజరయినట్టు తెలుస్తోంది.
మేకర్స్‌కు క్లోజ్
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు ధనంజయ, ధన్యత (Dhanyatha)ను పెళ్లికి హాజరయ్యారు. సోషల్ మీడియా మొత్తం ధనంజయ పెళ్లికి కంగ్రాచులేషన్స్ విషెస్‌తో మోతమోగిపోతోంది. ‘పుష్ఫ’లో నటించిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. టాలీవుడ్ మేకర్స్‌కు కూడా దగ్గరయ్యాడు ధనంజయ. అందుకే తనకు విలన్‌గా తెలుగులో మరికొన్ని అవకాశాలు ఇస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ‘పుష్ఫ’ తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించాడు ధనంజయ. కానీ అందులో జాలి రెడ్డి పాత్రకు వచ్చినంత పాపులారిటీ మిగతా పాత్రలకు రాలేదు. ఆ ఒక్క పాత్ర మాత్రం తనను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది.
Also Read: నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కన్నా ఓకే.. జయ బచ్చన్ షాకింగ్ స్టేట్‌మెంట్
హీరోగా ఎంట్రీ
నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ధనంజయకు ఎక్కువగా ఆదరణ లభించలేదు. మొదట్లో తను చేసిన సినిమాలు కూడా అంతగా హిట్ అవ్వలేదు. కానీ ధనంజయ (Dhananjaya) పర్ఫార్మెన్స్‌కు మాత్రం మొదటి నుండి మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. పైగా తన హైట్, వెయిట్, పర్సనాలిటీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. అలాంటి ధనంజయను కన్నడ ప్రేక్షకులు హీరోగా మాత్రమే చూశారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం తనలో ఒక విలన్‌ను చూశాడు. అలా ‘పుష్ప’లోని జాలి రెడ్డి పాత్రతో తన టాలీవుడ్ ప్రయాణం మొదలయ్యింది. ఆ తర్వాత ‘మను చరిత్ర’, ‘జీబ్రా’ లాంటి సినిమాల్లో కూడా నటించాడు ధనంజయ.
ನಗುನಗುತ್ತಾ ತಾಳಿ ಕಟ್ಟಿ, ಧನ್ಯತಾ ಅವರೊಂದಿಗೆ ನವಿರಾದ ನವಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ ನಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ಡಾಲಿ!😍 ಧನಂಜಯ ಹಾಗು ಧನ್ಯತಾ ಜೋಡಿಯ ಮದುವೆ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಗುರುಹಿರಿಯರ, ಆತ್ಮೀಯರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು! @Dhananjayaka#namtalkies #dhananjaya #drdhanyathagouraklar #dhanyathadhananjaya pic.twitter.com/iFOINyeYGD
— ನಮ್ ಟಾಕೀಸ್.ಇನ್ (@Namtalkies) February 16, 2025